సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో బయటపడ్డ కొత్త కోణం.. ఎవరి మీద కేసు పెట్టాలి

తెలుగ రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.

నిన్న రాత్రి 9 గంటల సమయంలో దుర్గం చెరువు సమీపంలోని కేబుల్ బిడ్జ్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి తీవ్రంగా గాయపడ్డాడు.

అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.అయితే తొలుత అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అనే వార్తలు వచ్చాయి.

కానీ ఈ వార్తల్లో అంతగా వాస్తవం లేదని తెలుస్తోంది.తలకు హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తున్న బైక్ స్కిడ్ కావడం సీసీ టీవీలో రికార్డు అయ్యింది.

సాయి బైక్ ఆ సమయంలో ప్రమాదకరంగా ఏమీ వెళ్లడం లేదని ఇందులో కనిపిస్తుంది.అయితే అంత ఈజీగా స్కిడ్ కాకుండా బైక్ తయారు చేయబడి ఉంది.

Advertisement
Sai Dharam Tej Bike Accident : Case Against GHMC, GHMC, Sai Dharam Tej, Sai Dhar

ప్రమాదం జరిగినప్పుడు కూడా బైక్ సడెన్ గా స్కిడ్ అయ్యింది.దానికి కారణం అక్కడ ఇసుక పేరుకుపోయి ఉంది.

సాయి బైక్ మాత్రమే కాదు.ఇప్పటికే పలు వాహనాలు అక్కడ స్కిడ్ అయినట్లు తెలుస్తోంది.

రోడ్డు పక్కనే నిర్మాణ పనులు జరుగుతున్నాయట.దాని కారణంగానే అక్కడ ఇసుక పేరుకుపోయిందట.

అయితే ప్రమాదానికి ముందే ఆ బిడ్జి మీద జీహెచ్ఎంసీ అధికారులు ఇసుకను తొలగించారట.నిజానికి సాయికి యాక్సిడెంట్ అయిన ప్రాంతంలో మినహా మరెక్కడా ఇసుక లేకపోవడం విశేషం.

Sai Dharam Tej Bike Accident : Case Against Ghmc, Ghmc, Sai Dharam Tej, Sai Dhar
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అటు ఈ ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు సాయి మీద కేసు పెట్టారు.అతివేగంతో పాటు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.తాజాగా అక్కడ ఇసుకే ప్రమాదానికి కారణం అయ్యిందని తెలియడంతో.

Advertisement

బాధితుడి మీద కేసు ఎలా నమోదు చేస్తారంటూ సోషల్ మీడియాలో పోలీసులపై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి.ఇసుక తొలగించకుండా రోడ్డు ప్రమాదానికి కారణం అయిన జీహెచ్ఎంసీ మీద కేసు పెట్టాలంటున్నారు నెటిజన్లు.

అక్కడ ఇసుకే లేకుంటే అసలు ప్రమాదమే జరిగేది కాదు అంటున్నారు.ఇప్పటికైనా సాయి ధరమ్ తేజ్ మీద పోలీసులు పెట్టిన కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజా వార్తలు