దేశ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా తన జోరు చూపిస్తున్న ప్రధాని మోడీకి( PM Modi ) ఈసారి అడ్డుకట్టు వేయాలని చూస్తున్న ప్రతిపక్షాలు ఉమ్మడిగా కూటమి ఏర్పాటు చేశాయి.
వచ్చే ఎన్నికలలో సీట్ల సర్దుబాటు చేసుకుని భాజాపాకు( BJP ) వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి నుంచి ఒక్క అభ్యర్థి ఉండేలా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
అయితే ఇప్పటికీ ఇండియా కూటమిలో( INDIA Alliance ) అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చాలానే ఉన్నాయి.ముఖ్యంగా కూటమిలో అత్యధిక పార్టీలు ఒక రాష్ట్రంలో పోటీ చేసే పరిస్థితి ఉన్నప్పుడు సీట్ల సర్దుబాటు ఎలా చేసుకోవాలి? ప్రచారానికి ఉపయోగించాల్సిన ప్రధాన అస్త్రాలు ఏమిటి? అసలు ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు? అన్న దగ్గరే విపక్షాలకు పేచి వస్తుంది.రాహుల్ గాంధీ( Rahul Gandhi ) అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ బలపరుస్తున్నప్పటికీ రాహుల్ అనుభవాన్ని సమర్ధతను విపక్షాలు అంగీకరించడం లేదు.
అసలు కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్( CM Nitish Kumar ) పేరు ప్రదాని పదవి కి వినిపించినప్పటికీ మొదటి సమావేశం వరకు యాక్టివ్ గా ఉన్న ఆయన తదనంతర పరిణామాలలో వెనకబడిపోయారు.
అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కి( Mamata Banerjee ) ప్రధాని పదవి పై చాలా ఆశలు ఉన్నప్పటికీ నిలకడ లేని రాజకీయాలు చేసే ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా కూటమి లో చాలామంది ఒప్పుకోవడం లేదట.ప్రస్తుతం కూటమిలో అతిపెద్ద భాగస్వామి కాంగ్రెస్సే కాబట్టి రాహుల్ గాంధీని అనధికారిక ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు .అయితే ఒకసారి అధికారికంగా ప్రకటిస్తే కూటమి లోని విపక్షాలు ఎంత మేరకుసహకరిస్తాయో, కూటమి తి కలసి నడుస్తాయో లేదో అన్న అనుమానంతో కాంగ్రెస్ వెనకాడుతుంది.
ఒకసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పుడు ప్రకటించే ఉద్దేశంతో కాంగ్రెస్ ( Congress Party ) ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రధాని అభ్యర్థని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్తే అది మోడీకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని మోడి ని ఢీకొట్టే నాయకుడి నీ ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంటుందంటూ విపక్షాలు వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది.ప్రధానమంత్రి అభ్యర్థి దగ్గరే విపక్ష కూటమి ఇండియా బలహీనపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి మోడీకి ప్రత్యర్థిని ప్రతిపక్ష కూటమి ఎప్పటికీ చూపిస్తుందో చూడాలి .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy