మహేష్ బాబు రాజమౌళి సినిమా మీద గాసిప్ వార్తలను స్ప్రెడ్ చేస్తుంది ఎవరు..?

ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరు కూడా తమదైన రీతిలో వర్క్ చేయాల్సిన అవసరమైతే ఉంది.

అందులో ఏ ఒక్కరు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోయినా కూడా సినిమా అనేది ఫ్లాప్ అయ్యే అవకాశాలుంటాయి.

అందువల్లే ఒక సినిమా మంచిగా వచ్చిందంటే దానికి టీమ్ మొత్తం సహకరించారని అర్థం.ఇక ఇదిలా ఉంటే రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ మాత్రం ఇప్పటివరకు ఒక ఫెయిల్యూర్ ని కూడా చవి చూడకుండా వరుస సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఆయన సినిమాలు చేసినప్పుడు ఆయనకంటూ సపరేట్ గా ఒక టీమ్ ఉన్నప్పటికీ చాలా వరకు ఓన్లీ ఒక్కడే డిసీజన్స్ తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు.

అందువల్లే ఆ సినిమా అవుట్ పుట్ అనేది చాలా విజువల్ గ్రాండీయర్ గా తెరకెక్కుతూ ఉంటాయి.ఇక ఏది ఏమైనా కూడా ఆయన సినిమాను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తారని చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పుడు మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లో( Pan World ) ఒక సినిమా చేయడమే కాకుండా ఈ సినిమాని భారీ సక్సెస్ గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి నెల నుంచి సెట్స్ మీదకి వెళ్తుందంటూ వార్త లైతే వస్తున్నాయి.ఇక దానికి అనుగుణంగానే ఇప్పటికే మహేష్ బాబుకు సంబంధించిన మేకోవర్ పనులను కూడా చాలా పకడ్బందీగా రెడీ చేసి పెట్టాడు.అయితే ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే దాని మీద రోజుకొక కొత్త వార్త ఆయితే వస్తుంది.

నిజానికి రాజమౌళి నుంచి గాని, మహేష్ బాబు దగ్గర నుంచి గాని ఎప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందనేది చెప్పకపోవడం విశేషం.అయితే వాళ్ళు చెప్పకున్న కూడా ఎందుకు ఈ సినిమా గురించి విపరీతమైన వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారనే విషయం మీద కూడా కొంతమంది సినీ మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు