తెలుగు ఆర్ఆర్ఆర్ కాదు కన్నడ లో కూడా ఒక ట్రిపుల్ ఆర్ ఉంది.. ముగ్గురు శెట్టిలు

ట్రిపుల్ ఆర్ ఈ పేరు తెలుగు లో చాల పాపులర్.వందల కోట్ల బడ్జెట్, స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్, బాలీవుడ్, హాలీవుడ్ కథానాయికలు.

ఇలా ఈ ఆర్ ఆర్ ఆర్ పేరు దేశవ్యాప్త సంచలనం.కానీ కాంతారా సినిమా తర్వాత మరొక ట్రిపుల్ ఆర్ సూపర్ సంచనం గా మారింది.

మరి తెలుగు ట్రిపుల్ ఆర్ కి మీనింగ్ తెలుసు ఈ కన్నడ ట్రిపుల్ ఆర్ అంటే ఏంటో తెలుసా ? రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బి శెట్టి.ముగ్గురు శెట్టి లు కలిసి సినిమాలు తీస్తూ కన్నడ లో ట్రిపుల్ ఆర్ గా చలామణి అవుతున్నారు.ఈ ముగ్గురు మంచి స్నేహితులు.

ముగ్గురు సినిమాకు మూడు ముఖ్యమైన భూమికలు పోషిస్తున్నారు.వీరి భాగస్వామ్యంలో సినిమా అంటే అంచనాలు అంతకంతకు పెరిగిపోవాల్సిందే.

Advertisement

అయితే ఇందులో రిషబ్ శెట్టి దర్శకుడు మరియు నటుడు కాగా, రక్షిత్ శెట్టి కన్నడలో టాప్ హీరో.మొదట్లో రష్మిక తో పెళ్లి కుదిరి ఎగేజ్మెంట్ వరకు వెళ్లి ఆ తర్వాత కారణాలు చెప్పకుండా బ్రేకప్ చేసుకున్నారు.

ఇక రాజ్ బి శెట్టి రిషబ్ శెట్టి కి సహాయకుడు.అతడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తూ దర్శకత్వం చేయడం అనేది ఊపిరి సలపని విధంగా ఉంటుంది.అందుకే ఇక్కడ రాజ్ బి శెట్టి చాల సీన్స్ కి దర్శకత్వం వహిస్తాడు.

కాంతారా సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ మాత్రం ఎక్కువభాగం రాజ్ బి శెట్టి పర్యవేక్షణలోనే జరిగింది.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
రన్నింగ్ ట్రైన్ లో ప్రత్యక్షమైన పాము.. దెబ్బకి ప్రయాణికులు?

అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా ఎక్కువగా రిషబ్ మరియు రాజ్ బి ప్రాణ స్నేహితులు. ఒక దశలో క్లైమాక్స్, వరాహ సాంగ్ రెండిటిని బ్యాలన్స్ చేయలేక, అటు నటించలేక డీలా పడుతున్న రిషబ్ కి అన్ని తానై భుజాల పై వేసుకొని సినిమాను ముందుకు తీసుకెళ్లాడు రిషబ్ శెట్టి.ఇక తనను నమ్మి మొదటి సినిమా అవకాశం ఇచ్చాడు కాబట్టి రక్షిత్ కూడా రిషబ్ కి మంచి మిత్రుడు.

Advertisement

అదే కృతజ్ఞత తో కిరికి పార్టీ సినిమాలో కూడా అతడినే హీరో గా పెట్టి తీసి హిట్టు పైన హిట్టు కొట్టాడు.తీసింది కేవలం నాలుగు అంటే నాలుగు సినిమాలు .కానీ కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు.

తాజా వార్తలు