అతిథుల లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారంటగా ? అంత నమ్మకం ఏంటి బాబు ? 

ఒకవైపు జూన్ 9వ తేదీన విశాఖలో ప్రమాణ స్వీకారం ( Visakhapatna )చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు వైసిపి అధినేత జగన్.

( YCP chief Jagan ) మరోవైపు చూస్తే టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )తానేమి తక్కువ కాదన్నట్లుగా అమరావతిలో జూన్ 9వ తేదీనే ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని ,తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాననే నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు.వైసీపీకి కేవలం 35 సీట్లు మాత్రమే వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.

ఆ గెలుపు ధీమాతోనే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటగా ఏమేమి చేయాలనే విషయం పైన ఆయన దృష్టి సారించారు.ఈసారి  పాలనలో తన మార్క్ ఏంటో చూపించాలని, జనరంజకంగా తన పాలన ఉండాలి అని చంద్రబాబు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారట.

అమెరికా నుంచి వచ్చిన చంద్రబాబు సన్నిహితులతో ఈ అంశాలపైనే చర్చిస్తూ కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారట.ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలకు అప్పుడే కొన్ని బాధ్యతలను అప్పగించారట.ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలనే దానిపైన ఒక జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

ప్రధాని నరేంద్ర మోది,  అమిత్ షాలను( Narendra Modi , Amit Shah ) ప్రమాణస్వీకారం కి ఆహ్వానించాలని,  వీరితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) ను పిలవాలని నిర్ణయించుకున్నారట.ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రజనీకాంత్ తో పాటు , ముఖ్య అతిధుల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా పార్టీ సీనియర్ నేత ఒకరికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం .

అలాగే ప్రమాణం స్వీకారానికి సంబంధించి వేద పండితుల సలహాలు తీసుకోవాలని మరో సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించారట .జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉండేలా చూడాలని,  అది కూడా అమరావతిలోనే ప్రమాణ స్వీకార సభను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.దీని కి అనుగుణంగానే ముందస్తుగానే కొన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు చేసేందుకు మరో సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించారట.

అలాగే జగన్ రెండు దఫాలుగా మంత్రివర్గ విస్తరణ చేసినట్లుగానే,  తాను కూడా రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం.అలాగే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం దేనిపైన చేయాలనే దానిపైన ఒక క్లారిటీ కి వచ్చారట.

అసైన్మెంట్ ల్యాండ్ చట్టాన్ని రద్దు చేస్తూ తొలి సంతకం చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మొత్తంగా చూస్తే చంద్రబాబు కచ్చితంగా టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని గట్టి నమ్మకంతో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో టిడిపి అధికారంలోకి రాబోతుందని నమ్మకాన్ని కలిగిస్తున్నారు.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు