ఉగాది పండుగకి తన అల్లుడైన వెంకటేశ్వరుడిని ఇంటికి రమ్మని పిలిచే ముస్లిం భక్తులు?

భారతదేశంలో ఎన్నో కులమతాలు ఉన్నాయి.ఇక్కడ జరుపుకొని కొన్ని పండుగలకు ఎలాంటి కుల, మత బేధాలు లేకుండా అందరూ కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

అలాంటి పండుగలలో ఉగాది కూడా ఒకటి.ఉగాది పండుగను ముస్లింలు హిందువులు అని తేడా లేకుండా రెండు మతాల వారు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

గత కొన్ని సంవత్సరాలుగా కడప జిల్లాలో ముస్లింలు ఉగాది పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.ఉగాది పండుగ రోజు ముస్లింలు తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.

ఉగాది పండుగ రోజు ముస్లిం భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొని, కొబ్బరికాయలు కొట్టి స్వామి వారి మొక్కులు తీర్చుకుంటారు.అదే విధంగా ఇక్కడ కొలువై ఉన్న స్వామివారికి ఉప్పు, పప్పు, చింతపండు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

Advertisement

ముస్లిం భక్తులు ఈ విధంగా ఉగాది పండుగ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వెనుక ఒక కథ ఉంది.

పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారిని వివాహమాడతాడనే విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా స్వామి వారు వివాహం చేసుకోవటం వల్ల హిందువులు ముస్లింల మధ్య బంధుత్వం ఏర్పడింది.అందుకోసమే వెంకటేశ్వర స్వామి వారిని ముస్లింలు తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు.

ఉగాది పండుగ రోజు స్వామివారి ఆలయాన్ని దర్శించి తమ ఇంటి అల్లుడిని ఇంటికి రావలసిందిగా వేడుకుంటారు.ఈ విధంగా ఈ ఆచారాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి కడపలో పెద్ద ఎత్తున పాటిస్తున్నారు.

ఉగాది పండుగ రోజు ఈ ఆలయ సందర్శనార్థం అనంతపురం, చిత్తూరు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే ఈ పండుగ రోజు ఈ ఆలయంలో హిందువుల కన్నా ముస్లింలు ఎక్కువగా స్వామివారిని దర్శించుకుంటారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు