బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యర్థి పార్టీ ఏదో.. ?

గత కొన్నాళ్లుగా తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ మరియు బిజెపి( BRS party ) మద్య పొత్తు కుదిరిందని రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఇలా రకరాల వార్తలు షికారు చేస్తున్నారు.

దానికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విషయాన్నే ప్రధాన విమర్శగా చేస్తున్నారు.

ఇక కే‌సి‌ఆర్ కూడా ఈ మద్య బిజెపిపై విమర్శలు తగ్గించి కాంగ్రెస్ పై పెంచడంతో బీజేపీ బి‌ఆర్‌ఎస్ మద్య రహస్య ఒప్పందం నిజమోనేమో అనే డౌట్ చాలమంది వ్యక్తం చేశారు.కానీ బీజేపీతో తమకు ఎప్పటికీ దోస్తీ ఉండదని ఇటీవల మంత్రి కే‌టి‌ఆర్ కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు.

దేశాన్ని సుధీర్ఘంగా పాలించిన కాంగ్రెస్, బీజేపీ( Congress party )లో దేశాన్ని నాశనం చేశాయని అలాంటి పార్టీలతో పొత్తు కలలో కూడా జరగదని కే‌టి‌ఆర్ స్పష్టం చేశారు.దీంతో బీజేపీ బి‌ఆర్‌ఎస్ మద్య దోస్తీ అనే వార్తలకు చెక్ పడినట్లైంది.గత గత కొన్ని రోజులుగా బీజేపీ పై విమర్శలు చేయడం దాదాపు తగ్గించారు బి‌ఆర్‌ఎస్ నేతలు.

దీనికి ప్రధాన కారణం.ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడమే.

Advertisement

ఆమె అరెస్ట్ కావడం దాదాపు ఖాయమే అని బీజేపీ చెబుతూ వచ్చారు.ఈ నేపథ్యంలో బీజేపీతో వైరం పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు గట్టిగా దెబ్బ తగిలే అవకాశం ఉండడంతో బీజేపీని కాదని కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు బి‌ఆర్‌ఎస్ నేతలు.

అయితే ఇక్కడే బి‌ఆర్‌ఎస్ ను ఇరుకున పెట్టె విధంగా కాంగ్రెస్ పావులు కదిపి.బీజేపీ బి‌ఆర్‌ఎస్ ( BJP )మద్య పొత్తు అంశాన్ని హైలెట్ చేస్తూ వచ్చింది.ఈ అంశం ప్రజల్లో కూడా గట్టిగానే చొచ్చుకెళ్లింది.

ఫలితంగా బీజేపీకి బి‌ఆర్‌ఎస్ తలోగ్గిందనే భావనా అందరిలోనూ కలుగుతూ వచ్చింది.దీంతో ఈ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ అంశం పై క్లారిటీ ఇవ్వక తప్పని పరిస్థితి.

అందుకే మంత్రి కే‌టి‌ఆర్( K.T.Rama Rao ) తాజాగా మాట్లాడుతూ.తమకు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ప్రత్యర్థులే అని తేల్చి చెప్పారు.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

అయితే మరి కే‌టి‌ఆర్ చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో రెండు పార్టీలను ప్రధాన ప్రత్యర్థులుగా బి‌ఆర్‌ఎస్ చూస్తుందా లేదా ఏదో ఒక పార్టీని మాత్రమే టార్గెట్ చేసి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు