మీ ఇంట్లో ఫ్యాన్ కి ఎన్ని రెక్కలున్నాయి? 3 రెక్కలా, 4 రెక్కలా.. ఏది బెటర్?

వేసవి మంట పుట్టిస్తోంది.అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఎండలు తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయి.

ఈ క్రమంలో అందరూ ఏసీలు కొనలేరు కదా.పోనీ ఎయిర్ కూలర్ కొందామన్నా.బాదుడే బాదుడు.

ఈ నేపథ్యంలో ఫ్యాన్ కొనుక్కోవాలని అనుకొనే వారికి రకరకాల డౌట్స్ వస్తుంటాయి.ఈమధ్య కాలంలో చూసుకుంటే రకరకాల బ్రాండ్లు 3 కన్నా ఎక్కువ రెక్కలు కలిగిన ఫాన్స్ ని మార్కెట్లోకి దించుతున్నాయి.

ఈ రెక్కల విషయంలో చాలామందికి ఓ డౌట్ వుంది.అదే 3 రెక్కల ఫ్యాన్ కొనుక్కొంటే మంచిదా లేక 4 రెక్కల ఫ్యాన్ కొనుక్కుంటే మంచిదా అని.

Advertisement

సాధారణంగా ప్రపంచంలో చూసుకుంటే మన ఇండియాలోనే ఫ్యాన్స్ ఎక్కువగా వాడుతుంటారు.అందులోనూ 3 రెక్కల ఫ్యాన్స్ ఎక్కువగా ఇక్కడ వాడుతూ వుంటారు.ఎందుకంటే.

మార్కెట్‌లో అవే ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి.ఇక సింగిల్ రెక్క ఉన్న ఫ్యాన్‌ని ఎవరైనా చూస్తే గనుక ఠక్కున "దానికి గాలి రాదు" అని మనసులో అనుకుంటారు.

ఇక 4 రెక్కలను చూస్తే."గాలి దంచి కొడుతుందేమో!" అని అనుకుంటారు.

ఇలా ఎవరి డౌట్లు వారికి ఉంటాయి.ఇకపోతే ఏ ఫ్యాన్ అయినా దానికి ఉన్న బ్లేడ్లు, దాని డిజైన్, దాని మోటర్, దాని నుంచి వచ్చే గాలి ప్రవాహ రేటు ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

సాధారణంగా సింగిల్ బ్లేడ్ ఫ్యాన్లు అనేవి ప్రత్యేకించి ఒకే ప్రదేశానికి మాత్రమే గాలిని పంపిస్తాయి.అందువల్ల వీటిని పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం వాడుతూ వుంటారు.ఇక 2 బ్లేడ్ల ఫ్యాన్లను ఇళ్లలో వాడుతుంటారు.

Advertisement

ఇవి ఎక్కువ గాలి ఇస్తాయి కానీ చిన్న గదులకు మాత్రమే ఇవి సెట్ అవుతాయి.ఇక 3 బ్లేడ్ల ఫ్యాన్లు గురించి అందరికీ తెలిసిందే.

ఇవి గాలిని అన్ని వైపులకూ సమానంగా ఇస్తాయి.ఇక 4 బ్లేడ్ల ఫ్యాన్ల వాడకం ఇప్పుడిప్పుడే పెరిగింది.

ఇవి పెద్ద గదులకు బాగా సెట్ అవుతాయి.విశాలమైన ప్రదేశాల్లో వీటిని వాడటం మేలు.

ఇవి ఎక్కువ గాలిని ఇస్తాయి.అందుకు తగ్గట్టే.

కరెంటు వాడకం కూడా పెరుగుతుంది.

తాజా వార్తలు