పోటీచేస్తారు సరే...పోటీ ఇస్తారా...జనసేన బలం ఎంత

ముందు తడబడినా .

అధికార పీఠమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్ర తో పార్టీలోనూ, అభిమానుల్లోనూ మంచి ఉత్తేజం అయితే నింపగలిగాడు.

పార్టీకి పెద్దగా బలం లేకపోయినా ఏదో తన వెనుక పెద్ద శక్తీ ఉన్నట్టుగా ఏపీలో అన్ని స్థానాల్లోనూ పాటీ చేస్తాను అని ప్రకటించాడు.దీనిలో భాగంగానే .పార్టీలోకి నాయకులను ఆహ్వానిస్తూ పార్టీని నాయకులతో నింపేందుకు చూస్తున్నాడు.రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు మనుగడ కోల్పోయిన కొంతమంది సీనియర్ పొలిటికల్ లీడర్లను చేరదీసి పార్టీలోకి ఆహ్వానిస్తూ ముందుకు వెళ్తున్నాడు.

ఇక్కడవరకు బాగానే ఉన్నా.ఏపీలో అసలు జనసేన వాస్తవ పరిస్థితి ఏంటనేది చూసుకుంటే.

పవన్ చెప్తున్నట్టుగా 175 నియోజకవర్గాల్లో సమర్థులైన అభ్యర్థులు దొరుకుతారా అనేది ప్రశ్నగా ఉంది.ప్రస్తుతం రాజకీయాలంటే డబ్బు, అనుచరగణం ఉన్న నాయకుల అవసరం చాలా ఎక్కువ.

Advertisement

ఇవేవీ లేని వారిని అసలు రాజకీయ నాయకులుగానే ప్రజలు సైతం గుర్తించేందుకు ఆసక్తి చూపని పరిస్థితులున్నాయి.పార్టీ ఏదైనా.

అభ్యర్థి ఎవరైనా ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా ఉండాలి.లేదంటే ప్రజలు అసలు గుర్తించే పరిస్థితే ఉండదు.

అంతా కొత్తవారికే సీట్లను కేటాయించి.స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతామంటూ పవన్ ప్రకటించినట్టుగా చేస్తే .జనసేన ఎన్నికల్లో గెలవడం కష్టం.అసలు ఖరారు చేసేందుకు రాజకీయ అనుభవం, ఇమేజ్ ఉన్న పెద్ద నేతలెవరూ ఇంతవరకూ పవన్ పార్టీలో చేరింది లేదు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం,వైసీపీలు చాలా బలంగా ఉన్నాయి.బలమైన నాయకులు, డబ్బు, అనుచరగణం పుష్కలంగా ఉన్న పార్టీలవి.వాటిని ఢీకొట్టాలంటే పవన్ బలం, బలగం కూడా అంతే పటిష్టంగా వచ్చే ఆరు నెలల్లో తయారు కావలసి ఉంటుంది.

చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి పేరున్న రాజకీయ నాయకులు వచ్చి చేరారు.వారే రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టుకున్నారు.చిరంజీవి కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.

Advertisement

ఎదుటి పార్టీలకు దీటుగా ప్రజారాజ్యం నేతలు కూడా అన్నింటిలోనూ పోటీ పడ్డారు.పవన్‌కు అప్పట్లో చిరంజీవికి ఉన్నంత క్రేజ్ ఉన్నా.

ఆ క్రేజ్‌తో వచ్చే ఓట్లతో పాటూ.సొంతంగా ఇమేజ్ ఉన్న నాయకులుంటేనే ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.

లేదంటే.ప్రజలు గుర్తించే పరిస్థితే ఉండదు.

పవన్ ఇప్పటివరకూ కేవలం ప్రకటనలు, అధికారపార్టీపై ఆరోపణలే తప్ప.తన పార్టీ పటిష్ఠతపై దృష్టిసారించింది లేదు.

పార్టీ పోటీ చేస్తుందని మాత్రమే చెప్పారు.తప్ప.

ఎవరు పోటీ చేస్తారనే క్లారిటీ జనసేనలో ఇప్పటి వరకూ లేదు.మిగతా రెండు పార్టీల తరఫున పోటీ చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి ఐదారు మంది ఉన్నారు వారిని ఫిల్టర్ చేసి ఎంపిక చేసుకోవడమే మిగిలి ఉంది.

కానీ జనసేనకు ఆ పరిస్థితి లేదు.

తాజా వార్తలు