సేఫ్ హాండ్స్ ఎక్కడ.. జానీ మాస్టర్ విషయంలో మెగా హీరో పై భారీ ట్రోల్స్?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) ఇటీవల కాలంలో భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు.

అయితే తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) విషయంలో కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదుర్కొంటు వార్తలలో నిలుస్తున్నారు.

జానీ మాస్టర్ ప్రస్తుతం మహిళ పట్ల లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటూ వార్తలలో నిలిచారు.తన అసిస్టెంట్ జానీ మాస్టర్ తన పట్ల లైంగిక వేధింపులకు దిగారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

ఈ తరుణంలోనే జానీ మాస్టర్ సోషల్ మీడియా వార్తలలో నిలిచారు.

Where Is Safe Hands Netizens Troll On Sai Dharam Tej , Sai Dharam Tej, Jani Mast

ఇక జానీ మాస్టర్ పై పెద్ద ఎత్తున నేటిజన్స్ కామెంట్లు చేస్తూ తనుకు శిక్ష పడాలనీ డిమాండ్ చేస్తున్నారు.ఈ తరుణంలోనే మెగా హీరో సాయిధరమ్ తేజ్ ను కూడా ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు.సేఫ్ హాండ్స్ ఎక్కడున్నావు? ఎందుకు ఈ ఘటనపై స్పందించట్లేదు అంటూ ఈ హీరో పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇక జానీ మాస్టర్ విషయంలో సాయి తేజ్ ను ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు.

Where Is Safe Hands Netizens Troll On Sai Dharam Tej , Sai Dharam Tej, Jani Mast
Advertisement
Where Is Safe Hands Netizens Troll On Sai Dharam Tej , Sai Dharam Tej, Jani Mast

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇకపై ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సేఫ్ హాండ్స్ లో ఉంది అంటూ పోస్ట్ చేశారు.అయితే అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సంఘటనలు జరిగిన ఈయనని ట్యాగ్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.ఇటీవల ఏపీలో జరిగిన అత్యాచార ఘటనలు అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఘటనలు, అన్న క్యాంటీన్లో శుభ్రత గురించి కూడా ఈయన పట్ల భారీ స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి జానీ మాస్టర్ విషయంలో కూడా సాయి తేజ్ విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు