గోదావరి లో రాజీ గా నటించిన నీతూ చంద్ర గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందంటే.?

గోదావరి 2006 సంవత్సరంలో విడుదలైన ఒక మంచి ఆహ్లాదకరమైన తెలుగు సినిమా.

పేరుకి ఉపశీర్షిక ఈ వేసవి చల్లగా ఉంటుంది దీనికి తగ్గట్లుగా ఈ సినిమా ప్రశాంతంగా సాగిపోతుంది.

శేఖర్ కమ్ముల చాలా అందంగా తీర్చిదిద్దారు.పాపికొండల అందాలు, గోదావరి హొయలు ఈ సినిమాలో బాగా చిత్రీకరించారు.

ఈ సినిమాలో సుమంత్ మరదలిగా "రాజి" పాత్రలో నటించిన "నీతూ చంద్ర" గుర్తుందా? 1984 జూన్ 20న బీహార్‌లోని పాట్నాలో నీతూ జన్మించారు.ప్రాధమిక విద్యాభ్యాసాన్ని పాట్నాలో పూర్తి చేసిన ఆమె ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీ నుంచి గ్యాడ్యుయేషన్ చేశారు.1997లో నీతూ చంద్ర వరల్డ్ తైక్వాండో ఛాంపియన్ షిప్‌లో పాల్గొని భారత్ పేరును నిలబెట్టారు.ఆమె తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ అందుకున్నారు.

నీతూ తన కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేస్తూ వచ్చారు.తరువాత పలు ప్రకటనల్లో నటించారు.2005లో హీరో అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలతో పాటు ‘గరం మసాలా’ సినిమాలో నటించారు.తరువాత పలు విజయవంతమైన చిత్రాల్లోనూ నటించారు.

Advertisement

ప్రస్తుతం నీతూ తన సోదరుడు నితిన్ చంద్ర నిర్మాణ సారధ్యంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఈ హెర్బల్ ఆయిల్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు