ఈ ఐపీఎల్ సీజన్ ఎక్కడ, ఎలా మొదలైందో.. అక్కడే, అలాగే ముగియనుంది..!

ఐపీఎల్ సీజన్( IPL Season ) ప్రస్తుతం తుది దశలో ఉంది.

మే 28 ఆదివారం అహ్మదాబాద్ ( Ahmedabad )లోని నరేంద్ర మోడీ స్టేడియం( Narendra Modi stadium ) వేదికగా గుజరాత్-చెన్నై( GT vs CSK ) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో సరికొత్త ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.ఈ ఐపీఎల్ సీజన్ ఎక్కడ, ఎలా మొదలైందో.

అక్కడే, అలాగే ముగియనుంది.ఈ ఐపీఎల్ సీజన్-16 మార్చి 31న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్- చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ తో మొదలైంది.

తర్వాత పది జట్ల మధ్య 57 రోజులలో 73 మ్యాచ్లు పూర్తయ్యాయి.చెన్నై, గుజరాత్ జట్లు ఫైనల్ కు చేరాయి.అంటే ఈ ఐపీఎల్ సీజన్ ఎక్కడ ఏ జట్లతో మొదలైందో.

Advertisement

అక్కడే ఆ జట్లతోనే ముగియనుంది.ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా( Aakash chopra ) ట్విట్టర్ లో విషయాన్ని షేర్ చేయడంతో, ఈ న్యూస్ వైరల్ అయింది.

ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సీజన్ తొలి మ్యాచ్లో గుజరాత్ గెలిచింది కదా.మళ్లీ గుజరాత్ గెలుస్తుందా లేదంటే సీన్ రివర్స్ అయ్యి చెన్నై గెలుస్తుందా అంటూ క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.కొందరేమో క్వాలిఫైయర్-1 మ్యాచ్లో చెన్నై గెలిచింది కదా.ఏ జట్టు గెలుస్తుందో ముందుగా ఊహించడం కష్టమే అంటున్నారు.ఎందుకంటే సీజన్ తొలి మ్యాచ్లో గుజరాత్ గెలిస్తే.క్వాలిఫైయర్-1 మ్యాచ్లో చెన్నై గెలిచింది.

ఇక క్వాలిఫైయర్-2 లో గుజరాత్ జట్టు ఓపెనర్ గిల్ శతకంతో జట్టును ఆదుకుంటే.గుజరాత్ జట్టు బౌలర్ మోహిత్ శర్మ ఏకంగా ఐదు వికెట్లు తీసి ముంబై బౌలర్లను కట్టడి చేశాడు.వీరికి మహమ్మద్ షమీప్ తీసిన రెండు కీలక వికెట్లు తోడవడంతో గుజరాత్ ఘనవిజయం సాధించి ఫైనల్ కు చేరింది.

మరి ఫైనల్ లో చెన్నై జట్టుపై ఈ ఆటగాళ్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉంది.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు