వీర్యం స్కలించకపోతే ఎప్పుడు డాక్టరుని కలవాలి? ఎప్పుడు కలవకూడదు?

పురుషులు ఎదుర్కోనే శృంగార సమస్యల్లో అంగస్తంభన, శీఘ్రస్కలనం అతిప్రధానమైన సమస్యలు అయితే, అసలు స్కలనం జరగకపోవడం తక్కువమందికి ఉండే సమస్య.

దీన్ని అప్పుడే సమస్య అనడం తొందరపాటే అవుతుందేమో.ఎందుకంటే కారణాన్ని బట్టి స్కలనం జరగకపోవడం లేదా "డ్రై ఆర్గాజామ్" నిజానికి సమస్యో, లేదా సహజంగా జరిగినదో తెలుసుకోవచ్చు.ఆ కారణాన్ని బట్టే మీరు డాక్టరుని కలవాలో లేదో నిర్ణయించుకోవాలి.అందుకే ఎప్పుడు డాక్టరుని కలవాలో, ఎప్పుడు కలవాల్సిన అవసరం లేదో చెబుతున్నాం.

ఎప్పుడు కలవాల్సిన అవసరం లేదంటే :

* శృంగారానికి ముందు స్వయం తృప్తి వలన పలుమార్లు స్కలనం జరిగింది అనుకోండి, వీర్యం నిల్వ ఉండదు.మళ్ళీ ద్రవంతో వీర్యాన్ని తయారుచేయడానికి శరీరానికి కొంత సమయం కావాలి.

ఇది సమస్య కాదు.* మార్నింగ్ గ్లోరి తరువాత, పొద్దున్నే శృంగారంలో వీర్యం రాకపోతే చింతించాల్సిన అవసరం లేదు.

* ఒక్కోసారి వీర్యం మూత్రంలో కూడా బయటకి వెళుతుంది.ఇలా తరుచుగా జరగనంతవరకు డాక్టర్ ని కలవాల్సిన పని లేదు.

ఎప్పుడు కలవాలి అంటే :

* పై కారణాలు కాకుండా, మిగితా ఏ కారణంతోనైనా వీర్యం బయటకి రాకపోతే డాక్టరుని సంప్రదించాలి.ఎందుకంటే ఈ సమస్యకు ఇలాంటి ప్రమాదాలు కారణం కావచ్చు.

- వెన్నుముక్కలో గాయాలు - స్కలన నాళంలో అడ్డుకట్టలు - ప్రొస్టేటు క్యాన్సర్ - హై బ్లడ్ షుగర్ లెవల్స్ - రక్తపోటు - టెస్టోస్టిరోన్ ఉత్పత్తి జరగకపోవడం .

ఈ రోజుల్లో అప్పు చేస్తే జీవితకాలం బకాయి తీర్చలేరా..

తాజా వార్తలు