బీజేపీ ఫైనల్ డెసిషన్ ఎప్పుడొమరి ?

టీడీపీ జనసేన పొత్తు( TDP Janasena ) ఎటొచ్చీ బీజేపీకి తలనొప్పిగా మారింది.

ఎందుకంటే ఆ పార్టీ మొదటి నుంచి జనసేనతో పొత్తులో ఉంటూ వచ్చింది.

కానీ రెండు పార్టీలు కలిసి ఏనాడు కార్యక్రమాలు చేపట్టిందిలేదు.ఏదో నామమాత్రంగా పొత్తు కొనసాగిస్తూ వచ్చాయి తప్పా.

నిజమైన మిత్రపక్షాలుగా ముందడుగు వేయలేదనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అసలు ఈ రెండు పార్టీలపొత్తు ఎంతవరకు కొనసాగుతుంది అనే అనుమానాలు కూడా గట్టిగానే వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో పవన్ హటాత్తుగా టీడీపీతో( TDP ) పొత్తు ప్రకటించారు.

Advertisement

దీంతో బీజేపీ పరిస్థితి డైలమాలో పడింది.అయితే పవన్ ఎన్డీయేలో కూడా కొనసాగుతామని చెప్పడంతో అర్థం కానీ పవన్ వ్యూహాలతో కమలనాథులు సైతం తలలు పట్టుకుంటున్నారు.అయితే బీజేపీతో పొత్తు క్యాన్సిల్ అని పవన్ ఎక్కడ చెప్పకపోవడంతో కమలనాథులు కొంత ఊపిరి పిల్చుకుంటున్నారు.

అందుకే జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందని చెబుతూనే టీడీపీతో పొత్తు అంశం మాత్రం అధిష్టానానిదే ఫైనల్ డెసిషన్ అంటున్నారు.తాజాగా బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు ( GVL Narasimha Rao )మాట్లాడుతూ.

ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతానికి జనసేనతో( Janasena ) పొత్తు ఉంటుందని అలాగే భవిష్యత్ లో పొత్తు విషయంలో మార్పులు జరగొచ్చని కూడా చెప్పి కొత్త అనుమానాలకు తావిచ్చారు.టీడీపీతో పొత్తుపై మాత్రం ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధిష్టానమే అన్నీ విషయాలను చూసుకుంటుందని చెప్పుకొచ్చారు.మరి బీజేపీ అధిష్టానం ఫైనల్ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

ఎందుకంటే మొదటి నుంచి కూడా టీడీపీతో కలవడంపై బీజేపీ సందేహిస్తూనే ఉంది.కానీ ఇన్నాళ్ళు జనసేన తమ పక్షాన ఉందనే దైర్యంతో బీజేపీ ఇన్నాళ్ళు వెనుకడుగు వేసింది.

Advertisement

కానీ ఇప్పుడు జనసేన కూడా టీడీపీ పక్షాన నిలవడంతో ఆ రెండు పార్టీలతో కలవడం బీజేపీకి తప్పనిసరిగా మారింది.దీంతో కాషాయ పెద్దలు ఉమ్మడి కూటమి వైపు అడుగులు వేస్తారా ? లేదా ఒంటరిపోరుకు సై అంటారా అనేది చూడాలి.

తాజా వార్తలు