అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ .. పుతిన్ దండయాత్రలు, యుద్ధాలు చేయగలిగాడా : నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నిక( US presidential elections )లకు సమయం దగ్గరపడుతుండటంతో అక్కడ రాజకీయాలు సైతం వేడెక్కుతున్నాయి.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి తర్వాత పరిస్ధితుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ట్రంప్‌కే విజయావకాశాలు ఉన్నాయట.ఇటీవల మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్‌ను అధికారికంగా నామినేట్ చేశారు.

దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు ట్రంప్ అభ్యర్ధిత్వానికి ఆమోదముద్ర వేశారు.ఇదే సమయంలో తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి) జేడీ వాన్స్‌ను ప్రకటించారు ట్రంప్.

ఈ నేపథ్యంలో ట్రంప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత సంతతికి చెందిన నిక్కీహేలీ( Nikki Haley ).ట్రంప్‌తో 100 శాతం ఏకీభవించని అమెరికన్లు ఉన్నారని.కానీ ఈసారి ఆయనకే ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

ప్రస్తుతం దేశం క్లిష్ట సమయంలో ఉందని.జో బైడెన్‌కు ఓటు వేస్తే కమలా హారిస్‌కి వేసినట్లేనని తాను ఏడాది ముందు నుంచే చెబుతున్నానని, ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత ఇది నిజమని అందరికీ అర్ధమైందన్నారు.

బైడెన్ ఇంకో నాలుగేళ్లు, హారిస్ ఒక్క రోజు పాలిస్తే అమెరికా దారుణంగా తయారవుతుందని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.ద్రవ్యోల్బణం, ధరలకు అనుగుణంగా లేని వేతనాలతో తోటి అమెరికన్లు భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

చాలా మంది మైనారిటీలు నేరాల వల్ల నాశనమైన కమ్యూనిటీలలో చిక్కుకున్నారని నిక్కీ హేలీ అన్నారు.ఇదే సమయంలో ఏ అధ్యక్షుడూ ఒంటరిగా అన్ని సమస్యలను పరిష్కరించలేరని వ్యాఖ్యానించారు.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఈరోజు ఎదుర్కొంటున్న సరిహద్దు సమస్య లేదని ఆమె గుర్తుచేశారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ లోయలో పడిపోయిన యువతి.. చికిత్స పొందుతూ మృతి..!
అమెరికా : జాహ్నవి కందుల మరణంపై హేళన .. ఆ పోలీస్ అధికారిని తొలగించిన ప్రభుత్వం

బైడెన్(Joe Biden ) పాలనలో .ప్రతిరోజూ వేలాది మంది వలసదారులు మనదేశంలోకి వస్తున్నారని.వారు ఎవరో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియడం లేదని నిక్కీ హేలీ చురకలంటించారు.

Advertisement

ఇరాన్‌పై బైడెన్ ఆంక్షలు ఎత్తివేశారని.అణు ఒప్పందంలోకి రావాలని అతను ఆ దేశాన్ని వేడుకుంటున్నారని, ఆఫ్ఘన్‌లో లొంగిపోయారని ఆమె దుయ్యబట్టారు.

హమాస్ చెరలో అమెరికన్లు బందీలుగా ఉంటే.బైడెన్ ఉగ్రవాదులపై కాకుండా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి చేస్తున్నాడని నిక్కీ హేలీ అన్నారు.

బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వ్లాదిమిర్ పుతిన్( Vladimir Putin ) క్రిమియాపై దాడి చేశారని.జో బిడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పుతిన్ ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించాడని ఆమె గుర్తుచేశారు.

అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పుతిన్ ఏమీ చేయలేదని, దండయాత్రలు , యుద్ధాలు లేవు అని నిక్కీ హేలీ అన్నారు.ట్రంప్ కఠినంగా ఉంటాడని తెలిసి పుతిన్ ఉక్రెయిన్‌పై దాడికి సాహసించలేదని నిక్కీ హేలీ ప్రశంసించారు.

అయితే ట్రంప్‌తో తాను ఏకీభవించనని.కానీ అమెరికాను బలంగా ఉంచడానికి మేం అంగీకరిస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు