వాట్సాప్‌లో రెండు సరికొత్త ఫీచర్లు.. వాటిని హైడ్ చేసుకునే ఛాన్స్..!

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అలవాటుపడ్డ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అని చెప్పవచ్చు.

ఈ యాప్ తన యూజర్ల ప్రైవసీయే తన ప్రధాన లక్ష్యంగా అనేక ఫీచర్స్ లాంచ్ చేస్తోంది.

కానీ యూజర్ల చాలా రోజులుగా కోరుతున్న ఒక ప్రైవసీ ఫీచర్ మాత్రం తీసుకురాలేదు.అదేంటంటే ఆన్‌లైన్ స్టేటస్ దాచేయడం.

యూజర్లకు లాస్ట్‌ సీన్ హైడ్ చేయడం ఇప్పుడు సాధ్యం అవుతుంది కానీ ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ (Hide) చేసుకునే సదుపాయం లేదు.దాంతో లాస్ట్‌ సీన్ మాత్రమే కాకుండా ఆన్‌లైన్ స్టేటస్‌ను ఇతర అన్ని కాంటాక్ట్స్‌కి కనపడకుండా హైడ్ చేయడం కుదరడం లేదు.

అందువల్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వాట్సాప్ ఈ ఫీచర్‌ను కూడా పరిచయం చేసేందుకు సిద్ధమైందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

Advertisement

ఇప్పటివరకైతే కేవలం టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే బీటా యూజర్లకు, ఆపై రెగ్యులర్ యూజర్లందరికీ అందుబాటులోకి రావచ్చు.టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో స్క్రీన్ షాట్ ద్వారా వాట్సాప్ బీటా ఇన్ఫో వివరించింది.

ఈ స్క్రీన్‌షాట్‌లో ఆన్‌లైన్ స్టేటస్ మార్చుకోవడం కూడా కనిపించింది.ఆ స్క్రీన్‌షాట్‌ ప్రకారం, ఈ ఆన్‌లైన్ స్టేటస్‌ను అందరికీ కనిపించేలా చేయవచ్చు.అలాగే లాస్ట్ సీన్ ఎవరికి కనిపించేలా సెట్ చేసుకున్నామో వారికి మాత్రమే ఆన్‌లైన్ స్టేటస్‌ కనిపించేలా పెట్టుకోవచ్చు.

ఒకవేళ లాస్ట్ సీన్ నోబడీ అని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారమే ఆన్‌లైన్ స్టేటస్ కూడా ఎంపిక చేసుకుంటే అప్పుడు ఆన్‌లైన్ స్టేటస్, లాస్ట్ సీన్ అనేది ఎవరికీ కనిపించదు.దీనివల్ల ప్రైవసీ బాగా మెరుగుపడుతుంది.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!
Advertisement

తాజా వార్తలు