వాట్సాప్ నుంచి ఉపయోగకరమైన ఫీచర్ లాంచ్.. దాని ప్రయోజనాలు ఇవే..

యాప్‌ను మరింత మెరుగ్గా, సెక్యూర్‌గా మార్చడానికి వాట్సాప్( Whatsapp ) కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

ఐఫోన్, ఆండ్రాయిడ్, కంప్యూటర్‌ యూజర్ల కోసం ఇప్పటికే చాలా ఫీచర్లను విడుదల చేసింది.

ఇప్పుడు, అఫీషియల్ చాట్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.ఈ ఫీచర్ యూజర్లకు కొత్త అప్‌డేట్లు, సెక్యూరిటీ సెట్టింగ్స్‌ గురించి సమాచారాన్ని అందిస్తుంది.

ఇది యూజర్లను మోసాలు, హ్యాకింగ్‌ల నుంచి సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.మొదట, కొంతమంది బీటా యూజర్లు మాత్రమే ఈ ఫీచర్‌కు యాక్సెస్‌ను పొందారు.

కానీ ఇప్పుడు అఫీషియల్ చాట్( Official Chat ) నుంచి ఎక్కువ మంది బీటా యూజర్లు మెసేజ్‌లు అందుకుంటున్నారు.వాట్సాప్ చాట్ విండోను మొదటిసారిగా ఓపెన్ చేసే యూజర్లు కొత్త అప్‌డేట్ల వివరాలు, కొత్త ఫీచర్లకు సంబంధించిన టిప్స్, ట్రిక్స్ తెలుసుకుంటారు.

Advertisement
WhatsApp Official Chat Feature Tips Tricks New Feature Details, WhatsApp, New Fe

యూజర్లు ఈ మెసేజ్‌లు స్వీకరించకూడదనుకుంటే, వారు అఫీషియల్ చాట్‌ను ఆర్కైవ్ చేయడం లేదా బ్లాక్ చేయడం ఎంచుకోవచ్చు.

Whatsapp Official Chat Feature Tips Tricks New Feature Details, Whatsapp, New Fe

యూజర్లు అఫీషియల్ చాట్ బ్లాక్ చేయకుంటే.వారు మొదటగా టూ-స్టెప్ వెరిఫికేషన్( Two Step Verification ) అనే ఫీచర్ గురించి మెసేజ్ అందుకుంటారు.ఈ ఫీచర్ 6-అంకెల కోడ్‌ను ఎంటర్ చేసిన తర్వాత PINని అడగడం ద్వారా యూజర్ అకౌంట్లకు ఎక్స్‌ట్రా సెక్యూరిటీని జోడిస్తుంది.

దీని గురించి అఫీషియల్ చాట్ చాలా వివరంగా తెలుపుతుంది.తద్వారా తెలియని వారు కూడా దీని గురించి తెలుసుకొని తమ అకౌంట్లకు సెక్యూరిటీ యాడ్ చేసుకునే అవకాశం పెరుగుతుంది.

Whatsapp Official Chat Feature Tips Tricks New Feature Details, Whatsapp, New Fe

ప్రస్తుతం, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.అయితే ఇది భవిష్యత్తులో ఐఫోన్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రావచ్చు.మరికొద్ది రోజుల్లో మరింత మంది వ్యక్తులు అఫీషియల్ చాట్ మెసేజ్‌లు అందుకుంటారు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు