ఈ సినిమాతో సక్సెస్ కొట్టకపోతే నాగార్జున పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

ఇక ఇలాంటి క్రమంలో కింగ్ నాగార్జున ప్రస్తుతం సంక్రాంతి కానుకగా తన కొత్త సినిమా అయిన నా సామిరంగా( Naa Saami Ranga ) అనే సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనే ప్రశ్నలు మన ముందుకు రానున్నాయి.అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచింది.

అయితే నాగార్జున (Nagarjuna ) కూడా హిట్టు కొట్టి చాలా సంవత్సరాలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో సక్సెస్ అనేది నాగార్జునకు చాలా కీలకంగా మారింది.లేకపోతే మాత్రం నాగార్జున మార్కెట్ అనేది భారీగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.అయితే నాగార్జునకి పోటీగా మరో మూడు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలవడంతో నాగార్జున ఎంతవరకు ఈ సినిమాతో సక్సెస్ కొడతాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఇక ఈ సినిమాతో కనక నాగార్జున సక్సెస్ కొట్టకపోతే మాత్రం నాగార్జున కెరీర్ అనేది దగ్గర్లో ఉండాలని చెప్పాలి.

నాగార్జున తన తదుపరి చిత్రం ప్రసన్న కుమార్ బెజవాడ అనే రైటర్ తో చేస్తున్నాడు.ఆయన్ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఆ సినిమాతో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున ఇంతకు ముందు చేసిన ఘోస్ట్( The Ghost ) ఆఫీసర్ లాంటి సినిమాలు ప్లాప్ అవ్వడం తో నాగార్జున ఇప్పుడు సినిమాల విషయం లో చాలా జాగ్రత్త గా ముందుకు వెళ్తున్నట్టు గా తెలుస్తుంది.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు