పవన్ రాజకీయాల్లో ఏం పారదర్శకత చూపిస్తారు..: మంత్రి అంబటి

పుంగనూరులో టీడీపీ నేతలు చేసిన దాడి ఘటన అమానుషమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

షెడ్యూల్ ప్రకారం రూట్ మ్యాప్ లో వెళ్లి ఉంటే సమస్య ఉండేది కాదని చెప్పారు.

చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపించారు.పవన్ కల్యాణ్ బ్రో సినిమా ప్లాప్ అన్న మంత్రి అంబటి రెమ్యూనిరేషన్ ఎంతో చెప్పలేని పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఏం పారదర్శకత చూపిస్తారని ప్రశ్నించారు.

కానీ తనపై మరో సినిమా తీయడానికి మాత్రం సిద్ధం అవుతున్నారని తెలిపారు.ఈ క్రమంలో తనపై తీసే సినిమా విడుదల అయిన తరువాత తాను ఓ సినిమా తీస్తానని స్పష్టం చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement