పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఈ దుర్మార్ఘుడు ఏం చేశాడో తెలుసా...?

మనిషి జీవితం అనేది నమ్మకంపై సాగుతుంది.నమ్మకం లేని సమయంలో ఎన్నో సంఘటనలు, మరెన్నో వివాదాలు తలెత్తుతాయి.

ఒక భార్యపై భర్తకు నమ్మకం ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లలపై నమ్మకం, పిల్లలకు తల్లిదండ్రులపై నమ్మకం ఉంటేనే కుటుంబంలో సంతోషం అనేది ఉంటుంది.నమ్మకం లేకుండా అనుమానం పెట్టుకుంటే మాత్రం జీవితం చాలా అఘమ్య గోచరంగా మారడం ఖాయం అంటూ నిపుణులు చెబుతున్నారు.

అనుమానం పెనుభూతం అని పెద్దలు అన్నారు, అలాంటి అనుమానస్తుడికి ఎదురైన పరాభవం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.అనంతపురం జిల్లాకు చెందిన మహేష్‌ హైదరాబాద్‌లో ఉద్యోగ రీత్యా ఉంటున్నాడు.

అతడికి ఇటీవల చైతన్యపూరికి చెందిన ఒక అమ్మాయితో వివాహం కుదిరింది.త్వరలో వివాహ నిశ్చితార్థం అనుకుంటున్న సమయంలో మహేష్‌కు ఒక ఆలోచన వచ్చింది.

Advertisement

ఈమద్య కాలంలో అమ్మాయిలు అస్సలు ప్రీగా ఉండటం లేదు.ఎవరో ఒక లవర్‌తో తిరుగుతున్నారు.

మరి తాను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎలాంటిదో కదా అనే అనుమానం అతడిలో మొదలైంది.అనుమానం భూతం అన్నట్లుగా అతడిని పీడించింది.

ఆమె గురించి తెలుసుకునేందుకు నాగోల్‌కు చెందిన ఒక డిటెక్టివ్‌ ఏజెన్సీకి 20 వేల రూపాయలు ఇచ్చి ఎంక్వౌరీ చేయమన్నాడు.

ఆ డిటెక్టివ్‌ ఏజెక్సీకి చెందిన వారు ఆ అమ్మాయిని వారం రోజుల పాటు ఫాలో అయ్యారు.ఆమె చదువుతున్న కాలేజ్‌లో ఆమె గురించి తెలుసుకోవడంతో పాటు, ఆమెకు ఎవరైనా ప్రియుడు ఉన్నాడా అంటూ తెలుసుకోవడం, ఆమె ఎవరితో మాట్లాడినా దాన్ని ఫొటోన్‌లో రికార్డు చేయడం చేశారు.ఆమెకు స్నేహితులు అయిన వారిని ఆమె క్యారెక్టర్‌ గురించి ప్రశ్నించడం జరిగింది.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

వారు తన గురించి తెలుసుకుంటున్నారన విషయం ఆమెకు తెలిసి అందరితో కలిసి నాలుగు పీకేందుకు ప్రయత్నించింది.అయితే వారు మహేష్‌ పంపిన వాళ్లం అంటూ అక్కడ నుండి వెళ్లారు.

Advertisement

పెళ్లికి ముందే ఇంత నీచంగా ప్రవర్తించిన ఆ వ్యక్తి పెళ్లి తర్వాత ఎలా ఉంటాడో అని భావించి అమ్మాయి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి మరీ అతడిని వదిలించుకున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్‌ ను మరియు డిటెక్టివ్‌ ఏజెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేయడం జరిగింది.

తాజా వార్తలు