'గాడ్ ఫాదర్‌' తో నీకేం పని భయ్యా.. దర్శకుడి పై నెటిజన్స్ ఫైర్‌

మెగాస్టార్ చిరంజీవి కరోనాను జయించిన తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం లో రూపొందుతున్న గాడ్ ఫాదర్‌ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.

అందుకు సంబంధించిన ఫోటోలను ఆదివారం ఉదయం షేర్ చేసిన చిరంజీవి మళ్లీ షూటింగులో జాయిన్ అయినట్లుగా ప్రకటించాడు.

గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో దర్శకుడు మెహర్ రమేష్ కనిపించడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈయనకు ఇక్కడ పనేంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

స్టైలిష్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న మెహర్ రమేష్ గత కొన్నాళ్లుగా ఫామ్‌ లో లేడు.అయినా కూడా ఆయనతో చిరంజీవి భోళా శంకర్‌ సినిమాను చేసేందుకు కమిట్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి అయిందని సమాచారం అందుతోంది.చిరంజీవి ఆ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం లో కొందరు మెగా ఫ్యాన్స్ వ్యతిరేకించారు.

Advertisement
What Mehar Ramesh Doing In Chiranjeevi God Father Movie Sets Details, Megastar C

సరే ఒక ఛాన్స్ ఇస్తే ఏమవుతుందిలే అన్నట్లుగా కొందరు భావిస్తున్న సమయంలో గాడ్ ఫాదర్‌ సినిమా షూటింగ్ లో కూడా ఆయన ఉండడం కాస్త ఆందోళన కలిగిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

What Mehar Ramesh Doing In Chiranjeevi God Father Movie Sets Details, Megastar C

గాడ్ ఫాదర్ సినిమా లో కూడా ఆయన భాగస్వామ్యం ఏమైనా ఉందా అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.దర్శకుడు తమిళ వ్యక్తి కనుక షూటింగ్ సమయంలో తెలుగు దర్శకుల సహాయం తప్పనిసరి అవసరం అవుతుంది.అందుకే ఆయన ఈ సినిమా షూటింగ్‌ ఆసాంతం పాల్గొంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

దర్శకుడికి లాంగ్వేజ్ హెల్ప్ లో అయితే పర్వాలేదు కానీ మొత్తం సినిమా మేకింగ్ లో కూడా తన నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేస్తే ఫలితం ఎలా వస్తుందో అనే ఆందోళన ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తో ఆయన చేస్తున్న భోళా శంకర్ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి తో అభిమానులు ఎదురు చూస్తున్నారు.

What Mehar Ramesh Doing In Chiranjeevi God Father Movie Sets Details, Megastar C

ఇలాంటి సమయంలో ఆయన గాడ్ ఫాదర్ సినిమాకు కూడా వర్క్ చేయడం కాస్త ఇబ్బంది కరంగానే ఉంది.చిరంజీవి ఎవరికి పడితే వారికి అవకాశం ఇవ్వడు అనే విషయం తెలిసిందే.టాలెంటు చూసి మరీ ఆయన సినిమాలు చేస్తాడు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

కనుక మెహర్ రమేష్ విషయంలో మెగాస్టార్ నిర్ణయం సరైనదే అయ్యి ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల కు సిద్ధం కాగా ఇదే ఏడాదిలో గాడ్ ఫాదర్‌ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.

Advertisement

అదే కాకుండా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా.వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాను చిరు చేస్తున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు