ఏంటి భయ్యా.. మందు కిక్కులో ఆర్టీసీ బస్సును ఏకంగా..?

ప్రస్తుత రోజులలో కొంతమందికి చుక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు ఉన్నారు.ఈ క్రమంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మద్యానికి బానిస అవుతున్నారు.

ఆ మద్యం మత్తులో కొంతమంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.అచ్చం అలాంటి సంఘటన తాజాగా నిర్మల్ జిల్లాలో( Nirmal District ) చోటుచేసుకుంది.

మద్యం మతలో ఏకంగా ఆర్టిసి బస్సునే డిపోలో నుంచి దొంగతనం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

What Kind Of Fear Is The Rtc Bus In Kikulu, Young Man, Drives, Rtc Bus ,the Infl

అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్ చోరీ అవ్వడం చూసి ఆర్టీసీ అధికారులు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.ఇక ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన సంఘటన విని ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ తరుణంలో డిపో నుండి రెండు కిలోమీటర్ల దూరంలోనే సాఫీ నగర్( Safi Nagar ) వద్ద బస్సు ప్రమాదానికి గురై అక్కడే నిలిచిపోవడంతో ఇది గమనించిన ఆ ప్రాంత సెక్యూరిటీ సిబ్బంది వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేసి నిందితుడిని పోలీసుల వద్దకు తీసుకొని వెళ్లారు.

What Kind Of Fear Is The Rtc Bus In Kikulu, Young Man, Drives, Rtc Bus ,the Infl
Advertisement
What Kind Of Fear Is The RTC Bus In Kikulu, Young Man, Drives, RTC Bus ,the Infl

సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.మహారాష్ట్రకు చెందిన గణేష( Ganesha ) అనే వ్యక్తి మధ్య మధ్యలో నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ డిపో లోకి ప్రవేశించి తాగిన మైకంలో ఆర్టీసీ బస్సులు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.డిపోలో నుంచి రెండు కిలోమీటర్ల మైన సోఫీ నగర్ వైపు వెళ్తుండగా కంచరోని చెరువు సమీపంలో బస్సు ప్రమాదానికి గురి కాగా.

ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆర్టీసీ ఆఫీసుకు సమాచారం అందజేయడంతో వెంటనే ఆర్టీ సెక్యూరిటీ సిబ్బంది వారు గణేశుని కడల్ గ్రామం సమీపంలో బైపాస్ వద్ద గుర్తించారు.ఇక పోలీసు విచారణలో భాగంగా గణేష్ బస్సు ఆగి ఉంటే తీసుకొచ్చానని నిందితుడు బదులు ఇచ్చాడు.

ఏది ఏమైనా.కానీ.

, ఇలాంటి పనులు చేయడం తప్పు అని పోలీసులు అతనికి తగిన శిక్ష విధిస్తే బాగుంటుంది అని కొందరి అభిప్రాయలు తెలుపుతున్నారు.

కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే
Advertisement

తాజా వార్తలు