శ్రీరామనవమి కి వడపప్పు - పానకం ఎందుకు తీసుకోవాలి ?

మన పెద్దవారు పెట్టిన ప్రతి ఆచారంలోను,సంప్రదాయంలోనూ ఎన్నో ఆరోగ్యపరమైన లాభాలు దాగి ఉన్నాయి.శ్రీరామనవమి కి వడపప్పు - పానకం నైవేద్యం పెట్టి ప్రసాదంగా ఎందుకు తీసుకుంటారో తెలుసా? అసలు మన పెద్దలు పెట్టిన ప్రసాదాలు అన్ని ఆయా ఋతువులను దృష్టిలో పెట్టుకొని మన శరీర ఆరోగ్యాన్ని బట్టి కూడా నిర్ణయించారు.

వడపప్పు - పానకం అనేవి కూడా ఆలా అలోచించి నిర్ణయించినవే.

ఈ ఋతువుల్లో వచ్చే గొంతు సంబంధ వ్యాధులకు పానకంలో వేసే మిరియాలు,యాలకులు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.మంచి ఔషధంగా పనిచేస్తాయి.అంతేకాకుండా పానకం విష్ణు మూర్తికి ప్రియమైనది.

ఈ ఋతువులో శరీరంలో వేడి కూడా పెరుగుతుంది.ఆ వేడి తగ్గించటానికి పెసరపప్పు సహాయాపడుతుంది.

పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది.జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది.

Advertisement

దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక.పెసరపప్పును వడపప్పు అని కూడా అంటారు.

అంటే మండుతున్న ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం.పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతికరమైనది.

అందువల్ల ఒక్క శ్రీరామనవమి రోజు నే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది.

శ్రావణ భార్గవి - హేమచంద్ర లవ్ స్టోరీ గురించి తెలుసా.. ఆ సినిమా టైం లోనే?
Advertisement

తాజా వార్తలు