తెలుగులో తమిళ్ సినిమాల హవా తగ్గడానికి కారణం ఏంటి..?

తెలుగులో తమిళ్ సినిమాల హవా అనేది కొద్ది కాలం పాటు చాలా ఎక్కువగా కొనసాగింది.

కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో( Tollywood ) ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా అవతరించే రోజులు ఆసన్నమవుతున్న కొద్ది తమిళ్ సినిమాలకు( Tamil Movies ) తెలుగులో కాలం చెల్లింది.

ఇక తమిళ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా తెలుగులో పెద్దగా సక్సెస్ ను సాధించలేకపోతున్నాయి.ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు అయితే ఇక్కడ భారీ సక్సెస్ లను సాధించడమే కాకుండా మన ప్రయోజనాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి.

ఇలాంటి సమయంలో మన తెలుగు సినిమాలే( Telugu Movies ) హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో వరుసగా సక్సెస్ లను అందుకుంటూ భారీ బ్లాక్ బాస్టర్లను ఇస్తున్నాయి.మరి ఇలాంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాంటివి అనేది కూడా తెలియాల్సి ఉంది.సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న అతిపెద్ద సినిమాల్లో రజనీకాంత్ వెట్టాయాన్,( Vettaiyan ) సూర్య కంగువా( Kanguva ) సినిమాలు భారీ సక్సెస్ ని సాధించడానికి రెడీగా ఉన్నాయి.

ఇక ఇలాంటి సందర్భంలో మళ్లీ తమిళ్ సినిమాలకి ఈ సినిమాలు జీవం పోస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక ఈ సినిమాలు కనక సూపర్ హిట్ అయితే ఫ్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లను సాధించిన సినిమాల్లో తమిళ్ సినిమాలు కూడా నిలుస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక ఇంతకుముందు విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలా నుంచి పాన్ ఇండియా సినిమాలు వచ్చినప్పటికి అవి మాత్రం భారీ సక్సెస్ లను సాధించలేకపోతున్నాయి.ఇక పాన్ ఇండియాలో తెలుగు హీరోలను కొట్టే హీరోలు ఇంకెవరు లేరనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ప్రతి భారీ సినిమా కూడా మనవాళ్లేదే కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు