Ram Charan Suriya : సూర్య రామ్ చరణ్ కాంబో లో మిస్ అయిన సినిమా ఏంటంటే..?

చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ).

చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇతను చేసిన రెండోవ సినిమా అయిన మగధీర తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఇండస్ట్రీలో తనని మించిన హీరో మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రేక్షకుల్లో హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా చాలా మందికి సేవ చేస్తు కూడా రామ్ చరణ్ మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు.

Ram Charan Suriya : సూర్య రామ్ చరణ్ కాంబో �

ఇక ఇది ఇలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న సూర్య( Suriya ).తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ లను సాధించాడు.ఇక ఎప్పటినుంచో తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేద్దామని అనుకుంటున్నా సూర్యకి అది మాత్రం వర్కౌట్ అవ్వడం లేదు.

ఇక ఇదిలా ఉంటే మగధీర సినిమా( Magadheera ) తర్వాత తమిళ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన మురుగ దాస్ ( Muruga Das )రామ్ చరణ్ ని సూర్య ఇద్దరిని పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు.కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ సినిమాకి సెట్స్ మీదికి వెళ్తే చాలా బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో దానిని స్టోరీ దశలోనే ఆపేసినట్టుగా వార్తలైతే వచ్చాయి.

Ram Charan Suriya : సూర్య రామ్ చరణ్ కాంబో �
Advertisement
Ram Charan Suriya : సూర్య రామ్ చరణ్ కాంబో �

ఆ సినిమా కనక తెరకెక్కి ఉంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సినిమాగా మిగిలిపోయిందని రామ్ చరణ్ అభిమానులు, సూర్య అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సినిమా రావాల్సింది కానీ మిస్ అయింది.ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు