సర్వేజనా సుఖినోభవన్తు. లోకాసమస్తా సుఖినోభవంతు అని ఎందుకు కోరుకోవాలి?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం చెట్టు, పట్ట, రాయి, రప్ప ఇలా ప్రతీ దానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తుంటారు.అందులో దేవుడున్నాడని నమ్ముతుంటారు.

వాటిని పూజిస్తూ.అందరూ బాగుండాలని కోరుకుంటారు.

What Is The Meaning Of Sarvejana Sukhinobhavanthu And Lokasamastha Sukhinobhavan

అంతే కాదండోయ్ అందరూ బాగుండాలి.అందులో నేనుండాలి అనుకునే వాళ్లు కూడా చాలా మందే ఉంటారు.

అలా అనుకోవడం ఇప్పటి నుంచే లేదు.పురాతన కాలం నుంచే ఉంది.

Advertisement

ఆ దేవుడిని ప్రార్థించేటప్పుడు సర్వేజనా సుఖినో భవంతు, లోకాసమస్తా సుఖినోభవంతు అంటూ మనసులోనే దైవ నామస్మరణ చేసుకునేవారు.లోకంలో మనం బాగుండాలి, బాగున్నాం! అనుకోకండి, మన చుట్టు వున్న సంఘం కరువు దరిద్రములతో బాధపడుతున్నారు అనుకుందాం, వారి దృష్టి ఎలావుంటుంది.

దరిద్రంలోవున్న ప్రజలు వారి కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం దోపిడీలకు, దొంగతనాలకు అలవాటుపడే అవకాశం ఉంది.వారు అలా ప్రవర్తించడం వలన వారు మన మీదకు దోపిడీకి వచ్చే అవకాశం ఉంది.

అనే భయంతో మనం జీవించాల్సి వుంటుంది.అందువలన మన చుట్టూ ఉన్న సంఘం బాగుంటే మనకు ఎటువంటి ప్రమాదాలు, భయాలు, ఉండవు.

సత్సంగం, సంఘస్సత్సు విధీయతాం సత్సంగత్యే నిస్సంగత్యం ఇలా ఎన్నో వాక్యాల గూఢార్థాలు కూడా యివే.అందు కోసమే "సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరుకోవాలి.

ఎండిన కొబ్బరితో దొరికే అధ్బుతమైన లాభాలు

అప్పుడే అందరితో పాటు మనం కూడా బాగుంటాం.అలాగే పక్క వాళ్ల బాగు చూస్తేనే దేవుడు మనకు మంచి చేస్తాడు.

Advertisement

అది కూడా దృష్టిలో పెట్టుకొని మెలగండి.

తాజా వార్తలు