స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు లక్ కలిసిరావడం లేదా.. ఈ డైరెక్టర్ కు సమస్య ఇదేనా?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Young director Prashant Verma ) గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగులో ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ అ,కల్కి, జాంబిరెడ్డి వంటి సినిమాలను తెరకెక్కించారు.

ఇక చివరిగా తెరకెక్కించిన హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు.ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది.

ఈ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నారు ప్రశాంత్ వర్మ.అయితే ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా కూడా ఇంత వరకు ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

దీంతో ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్, తన ప్రైమ్ టైంను వేస్ట్ చేసుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కాగా హనుమాన్ సినిమా విడుదలకు ముందు నిర్మాత డీవీవీ దానయ్య( DVV Danayya ) కుమారుడు కళ్యాణ్( Kalyan ) ను హీరోగా పరిచయం చేస్తూ అధీర అనే సినిమాను ప్రకటించాడు ప్రశాంత్ వర్మ.

What Is The Future Of Prasanth Varma, Prashanth Varma, Tollywood, Career, Future
Advertisement
What Is The Future Of Prasanth Varma, Prashanth Varma, Tollywood, Career, Future

కానీ హనుమాన్ సక్సెస్ తర్వాత అధీర దర్శకత్వ ( Directed Adhira )బాధ్యతల నుంచి తప్పుకొని, హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.కానీ ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించకముందే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ( Ranveer Singh )తో బ్రహ్మ రాక్షస సినిమాను ప్రకటించాడు.తీరా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళాక ఏవో కారణాల వల్ల ఆగిపోయింది.

ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటన వచ్చింది.నందమూరి వారసుడు మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యత రావడం అనేది నిజంగా గొప్ప విషయం.

దీంతో ప్రశాంత్ మరింత గొప్ప పేరు సంపాదించుకోవడం ఖాయమని అందరూ భావించారు.కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి.

ప్రాజెక్ట్ ఆగిపోలేదని మేకర్స్ నుంచి ప్రకటన వచ్చినప్పటికీ అసలు ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో? ఉంటే ఎప్పుడు మొదలవుతుందో? అనే దానిపై క్లారిటీ లేదు.

What Is The Future Of Prasanth Varma, Prashanth Varma, Tollywood, Career, Future
సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ తదుపరి సినిమాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.ప్రశాంత్ వర్మ కు లక్ కలిసి రావడం లేదా, నెక్స్ట్ సినిమాను ఎప్పుడూ మొదలుపెడతారు.నెక్స్ట్ ఏ సినిమా మొదలుకానుంది ఇలా ఎన్నో రకాల అభిప్రాయాలు ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

మొదట్లో ప్రశాంతంగా ఆచితూచి అడుగులు వేసినప్పటికీ రాను రాను ప్రశాంత్ వర్మ పరిస్థితి గందరగోళంగా మారిపోయింది.హనుమాన్ సినిమా తర్వాత మొదలు కావాల్సిన సినిమాలన్నీ కూడా ఆగిపోతున్నాయి.

అందుకు గల కారణాలు ఏమిటి అన్న విషయం పై సరైన స్పష్టత లేదు.అయితే వైపు దర్శకుడిగా వరుస సినిమాలను ప్రకటిస్తూ, మరోవైపు రచయితగా పని చేస్తూ ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ మీద అంటూ ఫుల్ ఫోకస్ పెట్టలేకపోతుండటం వల్లనే సినిమాలు సెట్స్ కి మీదకు వెళ్ళట్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

మరి ప్రశాంత్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్, ఇకనైనా తన ప్రైమ్ టైంని వేస్ట్ చేసుకోకుండా, వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్ట్ ను పట్టాలు ఎక్కిస్తాడేమో చూడాలి మరి.

తాజా వార్తలు