అంగస్తంభన ఉండి, స్కలనం కావట్లేదా?

చాలామంది పురుషులకి అంగస్తంభన సమస్యలు ఉంటాయి.నరాల బలహీనత కావచ్చు, సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం కావచ్చు .

ఇలా కొన్ని కారణాల వలన అంగం సరిగా స్తంభించదు.ఇలాగే పురుషులకి ఉండే మరో సమస్య శీఘ్రస్కలనం.

అంటే ఎక్కువసేపు సెక్స్ చేయలేకపోవటం.సంభోగం మొదలుపెట్టిన కొన్ని నిమిషాల్లోనే స్కలిస్తారు కొందరు మగవారు.

మరికొందరైతే ఉద్రేకం కంట్రోల్ చేసుకోలేక కలయిక మొదలుపెట్టక ముందే స్కలిస్తారు.దీంతో స్త్రీ అసంతృప్తి చెందుతుంది.

Advertisement

ఇలాంటి సమస్యలు ఈకాలంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి.కాని అంగస్తంభన సరిగానే ఉండి, స్కలనం జరగకపోతే ? ఇలాంటి సమస్య కూడా కొంతమందిని వేధిస్తుంది.ఈ కండీషన్ ని "రిటార్టెడ్ ఎజాకులేషన్" అని అంటారు.

ఈ సమస్యతో బాధపడే మగవారు చాలా ఆలస్యంగనైనా స్కలిస్తారు, లేదంటే పూర్తిగా స్కలించలేకపోతారు.అసలు మగవారికి భావప్రాప్తి కలిగేదే స్కలనం వలన.ఇక సమస్యతో బాధపడేవారు ఈ కారణంతోనే శృంగారాన్ని ఆస్వాదించలేకపోతారు.ఈ కండీషన్ కి ఇటు మానసిక కారణాలు, అటు శారీరక కారణాలు ఉంటాయి.

మానసిక కారణాలు తీసుకుంటే, ఆందోళన, ఒత్తిడి, స్త్రీ గాయపడుతుందేమో అనే భయం, తప్పు చేస్తున్నప్పుడు ఉండే భావోద్వేగాలు కారణమవుతాయి.ఇక శారీరక కారణాలు తీసుకుంటే, జననాంగాల్లో పుట్టుకతో వచ్చిన లోపాలు, స్పైనల్ కార్డ్ లో సమస్యలు, డయాబెటిస్, టెస్టోస్టిరోన్ డిఫిషియెన్సి లాంటివి ఉంటాయి.

ఈ సమస్యకు చికిత్స కారణాలను బట్టి మారుతూ ఉంటుంది.

Writer DV Narasaraju: అతను కలం పడితే ఏ సినిమా అయినా బ్లాక్‌బస్టర్ హిట్టే.. అందుకే మహామహులకు ఫేవరెట్..
Advertisement

తాజా వార్తలు