కర్ణాటకలో చేయని పని తెలంగాణలో చేస్తారా.. దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్..!!

తెలంగాణ( Telangana ) లో ఎన్నికల యుద్ధం మొదలైంది.ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు బిజెపి నువ్వా నేనా అనే విధంగా పోరాడుకుంటున్నారు.

ఓవైపు బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒకటే అని వ్యాఖ్యలు చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ బిజెపి ఒకటే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మూడు సభలు, 6 ఉపన్యాసాలు అన్నట్టుగా సాగుతున్నాయి.

తెలంగాణలో రాజకీయ ప్రచారాలు.ఇదే తరుణంలో బీఆర్ఎస్( BRS ) వారు తీసుకొచ్చినటువంటి పథకాల గురించి చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ బిజెపి నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేస్తున్నారు.ఇదే తరుణంలో కాంగ్రెస్ చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ నిర్వహించింది.

Advertisement

ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువస్తామని హామీ ఇచ్చింది.దీనిలో అంబేద్కర్ అభయహస్తం పేరుతో 12 లక్షల సహకారం అందిస్తామని తెలియజేసింది.

దీనిపై స్పందించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్( Danam Nagender ) కీలకమైన వ్యాఖ్యలు చేశారు.అవేంటో వివరాలు చూద్దాం.

ఖైరతాబాద్ లోని పీజేఆర్ నగర్ లో కాంగ్రెస్ నుండి చాలామంది యువకులు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దానం నాగేందర్ మాట్లాడుతూ. తెలంగాణలో బిజెపి పని అయిపోయిందని, కాంగ్రెస్ ను నమ్మేది లేదని, మూడోసారి అధికారంలోకి వచ్చేది కేసీఆర్( KCR ) ప్రభుత్వమే అని అన్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్( Congress ) పెద్దలు పిచ్చి పిచ్చి ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాలలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో మనం చూస్తే అర్థమవుతుందని, కాంగ్రెస్, బిజెపి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీ బందు, డబల్ బెడ్ రూమ్, దళిత బందు ఇచ్చే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?

అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు దళితులకు 12 లక్షలు మూడు ఎకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇస్తామంటున్న కాంగ్రెస్ మీరు అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో ఇస్తున్నారా అని అడిగారు.మీరు ఎన్ని డిక్లరేషన్లు పెట్టిన మరోసారి ప్రజలు కేసీఆర్ ని నమ్ముతారని, మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని దానం తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు