కేసు కొట్టేస్తారా.. వాయిదా వేస్తారా ?

ఏపీలో సంచలనం సృష్టించన స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( TDP Chandrababu Naidu ) 52 రోజుల పాటు జైలు రిమాండ్ ఎదుర్కొన్నాతెలిసిందే.

ఆ తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు మద్యంతర బెయిల్ ను ధర్మాసనం మంజూరు చేసింది.

కాగా ఈ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు మరోసారి కోర్టును ఆశ్రయించగా దీనిపై ఈనెల 16న వాదోపవాదనలు జరిగాయి.అయితే తీర్పును సోమవారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

దీంతో సోమవారం హైకోర్టు( High Court ) ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే చర్చ ఏపీ రాజకీయాల్లో కాకా రేపుతోంది.

స్కిల్ స్కామ్( Skill Scam ) అనేది చంద్రబాబుపై కక్ష పూరితంగానే జరుగుతోందని, ఇందులో ఎలాంటి నిజాలు లేవని టీడీపీ తరుపు న్యాయవాదులు చెబుతున్నా మాట.పైగా చంద్రబాబు ఆరోగ్య రీత్యా పలు సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి.గుండె వేగం పెరిగిందని తద్వారా ఆయనకు గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉందని, రక్త ప్రసరణలో కూడా లోపాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన నివేధికలు చెబుతున్నాయి.

Advertisement

ఇలా అక్రమ కేసులు ఆయనపై మోపడం వల్ల మానసికంగా ఆయన ఆరోగ్యం మరింత దెబ్బ తినే ప్రమాదం లేకపోలేదు.

అందుకే ఈ సమస్యలన్నిటి  కారణంగానే ఆయనకు రెగ్యులర్ బెయిల్( Regular Bail ) ఇవ్వాలనేది చంద్రబాబు తరుపు లాయర్లు చెబుతున్నా మాట.అటు వైపు సిఐడి చెబుతున్నదేమిటంటే.స్కిల్ స్కామ్ ను మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరత ఉందని, ఈ స్కామ్ తో పాటు మరోకొన్ని స్కామ్ లు ముడిపడి ఉన్నాయని అందుకే స్కిల్ స్కామ్ ను తిలిగ్గా తీసుకోవడానికి వీలేదని చెబుతున్నారు.

ఇలా అటు ఏపీ సీఐడీ గాని ఇటు చంద్రబాబు చేస్తున్న వాదనలు గాని రెండిట్లోనూ నిజనిజాలను బయట పెట్టడం అంతా తేలికైన విషయం కాదు.అందుకే రేపు హైకోర్టు( High Court ) ఇచ్చే తీర్పుపై స్కిల్ స్కామ్ అంశం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరి ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు