ట్రేడింగ్ లో డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటో మీకు తెలుసా?

స్టాక్ మార్కెట్లో( Stock Market ) ఒక రకమైన ప్రాక్సీ ట్రేడింగుని డబ్బా ట్రేడింగ్( Dabba Trading ) అని అంటారు.

ఇది స్టాక్ ఎక్స్ఛేంజీల వెలుపల జరిగే స్టాక్ ట్రేడింగ్ గా చెప్పుకోవచ్చు.

అయితే దీనిని కొంతమంది చట్టవిరుద్ధమైనదని చెబుతూ వుంటారు.ఈ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్‌లో లా మార్కెట్ ఎగుడు దిగుళ్ళను ఊహించడం ద్వారా డబ్బు అనేది సంపాదిస్తూ వుంటారు.

ఈ వ్యాపారం అనేది ఒక జూదం లాంటిది.కావడంతో సెబీ ( SEBI ) నిషేధం కూడా విధించింది.

ఈ వ్యాపార కార్యకలాపంలో పాల్గొన్న బ్రోకర్లను సాధారణంగా “డబ్బా ట్రేడర్స్ ” లేదా “డబ్బా ఆపరేటర్లు”గా సూచిస్తారు.

What Is Dabba Trading How It Will Be Managed Details, Dabba Trading , Trading,
Advertisement
What Is Dabba Trading How It Will Be Managed Details, Dabba Trading , Trading,

ఇక్కడ ట్రేడ్ చేసేవారు సెబీ లేదా మరే ఇతర బిజినెస్ గ్రూప్ లో కూడా రిజిస్టర్ కారు.అలాగే వారి కార్యకలాపాలు చాలా చట్టవిరుద్ధంగా ఉంటాయి.ఇక వీరిని డబ్బా ట్రేడింగ్ అని పిలవడం వెనుక ఉన్న కారణం ఏమంటే డబ్బా అంటే ఒక చోటి నుంచి మరొక ప్రదేశానికి వస్తువులను రవాణా చేసే బాక్స్‌ను సూచిస్తుంది.

అదేవిధంగా ఈ ట్రేడింగ్‌లో, డబ్బా అంటే ఓ భవనంలోని చిన్న ఆఫీసుల నుంచి పనిచేసే బ్రోకర్ల నెట్‌వర్క్. వారు తమ క్లయింట్‌ల తరపున బిజినెస్ చేయడానికి మొబైల్ ఫోన్‌లు లేదా ఇతర పరికరాలను ఉపయోగిస్తారు.

What Is Dabba Trading How It Will Be Managed Details, Dabba Trading , Trading,

ఇక్కడ డబ్బా ఆపరేటర్ షేర్ బ్రోకర్ లాగా పని చేస్తాడు.కానీ అతను వాస్తవానికి షేర్లను కొనడం గానీ అమ్మడం కానీ చేయడు.మామ్మూలుగా చెప్పాలంటే, డబ్బా ఆపరేటర్, ఇన్వెస్టర్ ఇద్దరూ ఈ రకమైన వ్యాపారం నుంచి డబ్బు సంపాదిస్తారు.

అయితే ఎక్కువగా డబ్బా ఆపరేటర్లు లేదా డబ్బా ట్రేడింగ్ బ్రోకర్లు డబ్బు సంపాదిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇక్కడ చాలా సార్లు వారు ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
పెద్ద ప్లానే.. స్టూడెంట్స్‌ను స్కూల్‌ రప్పించేందుకు టీచర్లు మాస్టర్ ప్లాన్ వేసారుగా!

ఈ విధంగా ఇన్వెస్టర్ చివరికి చిక్కుకుపోతాడు.షేరు ధర పడిపోయినప్పుడు, ఇన్వెస్టర్ లేదా కస్టమర్ నష్టపోతాడు.

Advertisement

నిజం ఏమిటంటే స్టాక్ మార్కెట్‌లో ఎక్స్ఛేంజీల ద్వారా వ్యాపారం చేయడం అనేది చాలా సులభం మరియు చట్టబద్ధమైనది.అందువల్ల, మీరు బాక్స్ ట్రేడింగ్ వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటే మంచిది.

తాజా వార్తలు