అయోధ్య అంటే ఏంటి..? దాని యొక్క విశిష్టత ఏంటి..?

మన దేశంలో అత్యంత ప్రాచీనమైన ఏడు క్షేత్రాలు ఉన్నాయి.ఈ ఏడుక్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు.

అయితే పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత బ్రాహ్మణ గురువు బంధు పరివారం, హత్య దోష నివారణర్థనం ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించాకే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు.అయితే ఈ ఏడుక్షేత్రాలో వైష్ణవ, శైవ క్షేత్రాలు రెండు ఉన్నాయి.

వీటిని జీవిత కాలంలో ఒక్కసారి దర్శించుకున్న కూడా సకల పాపాలు నశించి స్వర్గానికి వెళ్తారని భక్తుల విశ్వాసం.అయితే ఈ ఏడు నగరాల్లో మొదటిది రామ జన్మభూమి అయోధ్య.

మహావిష్ణువు ( Lord Vishnu )దశావతారాల్లో ఒకటైన శ్రీ రామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య.ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో ఉన్నా ఈ క్షేత్రానికి రామజన్మభూమి అనీ ప్రసిద్ధి.

Advertisement

ఇక స్కంద పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొనడం జరిగింది.ఇక దేవుడు నిర్మించిన నగరం కావడంతో ధార్మికంగా ఈ నగరం అత్యంత ప్రాధాన్యత కలిగిందని భక్తుల విశ్వాసం.

వాస్తవానికి అయోధ్య అంటే భారతీయ ఆత్మకు అనువాదం.యుగయుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువల పుట్టిల్లు.

మానవ సంబంధాలకు కుటుంబ జీవనానికి, గురు శిష్య బంధానికి, భార్యాభర్తల అనురాగానికి, అయోధ్య అంటే వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక వెలుగులు పంచుతున్న రామాయణ మహాకావ్యానికి మూలం అయిన దివ్య క్షేత్రం.ఇక గిరిపుత్రి శబరి( Shabari )ని, పడవ నడిపే గుహుడినీ, పక్షి అయినప్పటికీ ధర్మం వైపు నిలబడిన జటాయువుని సమానంగా చూసిన శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం.అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్థం.

అయితే గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలి భాషలో అయోజిహాగా పేర్కొన్నారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది.రామాయణ కాలం కన్నా ముందే సాకేతపురం అనే పేరుతో అయోధ్యను పిలిచేవారు.ధర్మశాస్త్రకర్త మనువు అయోధ్య( Ayodhya )ను నిర్మించాడంట.

Advertisement

మనువు కుమారుడే ఇక్ష్వాకు.అయితే వీరిది సూర్యవంశం.

ఈ వంశంలో 31 వ రాజు హరిశ్చంద్రుడు.అలాగే సాగరం అనే పేరుకు మూలమైన సాగరుడు, రఘు మహారాజు కూడా ఈ వంశీకులే.

ఇక రఘుమహారాజు మనవడు, కోసలిని పాలించిన 63వ చక్రవర్తి దశరధుడు. ఆ దశరధుడు యొక్క కుమారుడే శ్రీరామచంద్రుడు.

తాజా వార్తలు