ఉదయం ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమవుతుంది.. లాభమా? నష్టమా?

డ్రై ఫ్రూట్స్ ( Dry fruits )లో ఎన్నో రకాలు ఉన్నాయి.

బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్, అంజీర్ ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి.

వేటికవే ప్రత్యేకమైన రుచిని, పోషకాలను కలిగి ఉంటాయి.అయితే అన్నిటినీ కలిపితే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అంటారు.

చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో మిక్స్ డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటారు.అసలు ఉదయం ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తినవచ్చా.? తింటే ఏమవుతుంది.? లాభమా.? నష్టమా.? అన్న సందేహాలు ఎందరిలోనూ ఉన్నాయివాస్తవానికి ఉదయం ఖాళీ కడుపుతో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

డ్రై ఫ్రూట్స్ లో మినరల్స్, విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా నిండి ఉంటాయి.అందువల్ల వాటిని డైట్ లో చేర్చుకుంటే ఎంతో మంచిది.

Advertisement

ముఖ్యంగా ఉదయం తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి కావాల్సినంత శక్తి శరీరానికి లభిస్తుంది.

డ్రై ఫ్రూట్స్( Dry fruits ) మీ ఎనర్జీ లెవెల్స్ ను ఎప్పుడూ పిక్స్ లో ఉంచుతాయి.నీరసం అలసట వంటి వాటికి గురికాకుండా రక్షిస్తాయి.బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఎంతో మంది శరీరానికి అవసరం అయ్యే పోషకాలను అందించడంలో విఫలం అవుతున్నారు.

కడుపు నింపుకోవడం కోసం ఏదో ఒక గడ్డిని నమిలేస్తున్నారు.మీరు ఈ జాబితాలో అంటే.కచ్చితంగా ఉదయం మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి.

వీటితో మీకు అవసరమయ్యే చాలా పోషకాలు అందుతాయి.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

అలాగే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దీంతో గుండె ఆరోగ్యం( Heart health ) మెరుగుపడుతుంది.గుండెపోటుతో సహా వివిధ రకాల గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

Advertisement

అంతేకాదు డ్రై ఫ్రూట్స్ తింటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.

ఎముకలు బలోపేతం అవుతాయి.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

మరియు చర్మం కూడా యవ్వనంగా నిగారింపుగా మెరుస్తుంది.

తాజా వార్తలు