వర్షం నీటిని తాగవచ్చా.. అసలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

వర్షాకాలం ప్రారంభం కాబోతోంది.అయితే చాలా మందికి ఒక కామన్ డౌట్ అనేది ఉంది.

అదేంటంటే వర్షం నీటిని( Rain water ) తాగవచ్చా.? అసలు తాగితే ఏం జరుగుతుంది.? వర్షం నీటిని తాగడం వల్ల లాభాలా లేక నష్టాలా.? ఇలాంటి ప్రశ్నలు మీకు ఉన్నాయి కదా.నిజానికి వర్షం నీటిని తాగొచ్చు.ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు స్వయంగా వెల్లడించారు.

పైగా వర్షం నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని కూడా అంటున్నారు.అవును మీరు విన్నది నిజమే.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వర్షం నీటిని నేరుగా సేకరించి ఏడాది పొడవునా వాడుకుంటున్నారు.అయితే ఎప్పుడు పడితే అప్పుడు వర్షం నీటిని సేకరించి తాగొచ్చు అనుకుంటే పొరపాటే.

Advertisement

వర్షాకాలం ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత పడే వాన నీటిని నేరుగా సేకరించాలి.అలాగే రాగి పాత్ర( Copper )లో మాత్రమే వర్షం నీటిని సేకరించాలి.

నీటిని శుద్ధి చేసే గుణం రాగికి ఉంది.అందువల్ల రాగి పాత్రలో వర్షం నీటిని సేకరిస్తే.

అందులో ఏమైనా మలినాలు ఉంటే నాశనం అవుతాయి.నీరు శుద్ధి గా మారతాయి.

నీటి నాణ్యత పెరుగుతుంది.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

ఇక వర్షం నీటిని సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ముఖ్యంగా వర్షం నీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.అలాగే వర్షం నీటిని తాగితే నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Advertisement

జీర్ణవ్యవస్థ( Digestive system ) చురుగ్గా మారుతుంది.తద్వారా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు వర్షం నీటిని తాగడం వల్ల చర్మం తేమగా, కోమలంగా, యవ్వనంగా మెరుస్తుంది.జుట్టుకు కూడా వర్షం నీరు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా వర్షం నీటితో హెయిర్ వాష్ చేసుకుంటే కనుక కుదుళ్ళు బలోపేతం అవుతాయి.

దాంతో హెయిర్ ఫాల్ సమస్య అనేది క్రమంగా కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతుంది.

తాజా వార్తలు