కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం తెర వెనక ఏం జరుగుతుంది ?

దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటు బ్యాంక్ ప్రభావం చూపించే రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి.

పాతబస్తీ పరిధిలో ఎంఐఎంను గెలిపించే మైనారిటీలు బయట కూడా ఆ పార్టీ చెప్పిన వారికి ఓటు వేసేవారు .

అయితే క్రమేణా పరిస్థితి మారుతున్న వాతావరణం కనిపిస్తుంది .ఇప్పుడు మైనారిటీల చూపు కాంగ్రెస్( Congress ) వైపు షిఫ్ట్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .ముఖ్యంగా టిఆర్ఎస్( TRS ) తో మంచి దోస్తీ నెరుపుతున్న ఎంఐఎం ఒకప్పుడు కాంగ్రెస్కి నమ్మకమైన స్నేహితుడుగా ఉంటూ వచ్చింది.అయితే గత కొంత కాలం గా పాత బస్తి వరకు తమకు రాశి ఇచ్చిన్నట్టు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చిన బియారస్ వైపు షిఫ్ట్ అయిన ఎంఐఎం గత రెండు ఎన్నికలలో అధికార బారాసాకే మద్దతు ఇస్తూ వచ్చింది.

అయితే తెలంగాణ లో కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటూ ముస్లిం ఓటర్లను ఆకర్షించడం ఇప్పుడు మిత్ర పక్షాలను కొత్త ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

అందుకే కాంగ్రెస్పై సౌండ్ పెంచేశారు ఓవైసీ బ్రదర్స్ .కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం ద్వారా ముస్లిం ఓటర్లను ఐఖ్యం చేసి గంపగుత్తగా తాము పోటీలో లేని చోట్ల బీఆర్ఎస్ కు షిఫ్ట్ చేయాలని ఒవైసీ బ్రదర్స్ ఆలోచనగా తెలుస్తుంది.కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశాలలో ఓల్డ్ సిటీకి చెందిన మస్కతి డైరీ చైర్మన్ అలీబిన్ ఇబ్రహీం మస్కతిని( Alibin Ibrahim Maskatini ) కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు.

Advertisement

పాతబస్తీలో పలుకుబడి ఉన్న మహమ్మద్ అయూబ్ ఖాన్ ( Muhammad Ayub Khan ) తన కుమారులు శభాజ్ ఖాన్, అర్బజఖాన్ ల తో కలిసి పార్టీలో చేరారు.ఇలా ముస్లిం కీలక నేతలు కాంగ్రెస్ కి చేరువవుతుండడంతో ఇప్పుడు కాంగ్రెస్ కొత్త శత్రువుగా ఎంఐఎంకు మారినట్లుగా తెలుస్తుంది.

అందుకే ఓవైసీ అగ్రనేత రాహుల్ కి ఛాలెంజ్ చేశారు .దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలవాలంటూ సవాల్ చేశారు, గెలిచేది షేర్వానీ నా టోపీనా తేలిపోతుందన్నారు.అంతే కాకుండా అక్బరుద్దీన్ కూడా రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.

ఓవైసీలు మహారాష్ట్ర నుంచి వచ్చారన్న కాంగ్రెస్ నేతలు మాటలపై ఘాటుగా స్పందించారు రేవంత్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారని కాదని భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలంటూ ఛాలెంజ్ చేశారు.ఇలా కాంగ్రెస్ను టార్గెట్ చేయడం ద్వారా ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయాలన్న ఆలోచన లో ఎంఐ ఎం ఉన్నట్లుగా తెలుస్తుంది.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు