ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెరుకు రసం మెషిన్‌లో ఇరుక్కుపోయిన మహిళ జుట్టు.. ఏం జరిగిందంటే?

తెలంగాణ డోర్నకల్‌లో చెరుకు రసం మెషిన్ ( Sugarcane Juice Machine )వద్ద జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రజిని అనే మహిళ జ్యూస్ తీస్తుండగా, ఆమె జడ అనుకోకుండా మెషిన్ రోలర్లలో చిక్కుకుపోయింది.

క్షణాల్లో జుట్టును యంత్రం లోపలికి లాగేయడంతో ఆమె తీవ్ర నొప్పితో హాహాకారాలు చేసింది.ఈ భయానక దృశ్యం వీడియోలో రికార్డ్ అయ్యింది.

ఆ వీడియో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయ్యింది.దీంతో, చిన్న ఫుడ్ స్టాల్స్‌లో భద్రతా లోపాలపై ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

వీడియోలో కనిపించిన ప్రకారం, రజిని కేకలు విన్న స్థానికులు, కస్టమర్లు వెంటనే స్పందించారు.చురుగ్గా ఆలోచించి మెషిన్ పవర్ ఆపేశారు.

Advertisement
What Happened To The Woman's Hair Stuck In The Sugarcane Juice Machine In This H

దాంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది లేకపోతే ఆమె ప్రాణాలు దక్కేవి కావు.

What Happened To The Womans Hair Stuck In The Sugarcane Juice Machine In This H

మెషిన్ స్విచ్ ఆఫ్ చేసిన అనంతరం రోలర్లలో గట్టిగా ఇరుక్కుపోయిన ఆమె జుట్టును చాలా జాగ్రత్తగా విడిపించారు.వారి సకాల స్పందన వల్లే రజిని కేవలం చేతికి స్వల్ప గాయాలతో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది.వారు చేసిన సహాయానికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు చెప్పుకున్నారు.

What Happened To The Womans Hair Stuck In The Sugarcane Juice Machine In This H

ప్రస్తుతం రజిని కోలుకుంటున్నప్పటికీ, వైరల్ అయిన ఈ వీడియో.జ్యూస్ బండ్లు, టీ స్టాల్స్ వంటి చిన్న వ్యాపార కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల లోపాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది.నిర్లక్ష్యం ఎలాంటి భయంకరమైన ప్రమాదాలకు దారితీస్తుందో ఈ సంఘటన కళ్లకు కట్టింది.

భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని, తరచూ తనిఖీలు చేపట్టాలని ప్రజలు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఇలాంటి పరికరాలతో పని చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.ఈ వార్తను మీ కుటుంబ సభ్యులకు తప్పక షేర్ చేయండి.

Advertisement

తాజా వార్తలు