Sudheer Babu : అన్ని ఉన్న ఆ ఒక్కటి కలిసి రావడం లేదు సుధీర్ బాబు కి ..పాపం

సుధీర్ బాబు( Sudheer Babu ).ఘట్టమనేని ఇంట్లో ఒక మెంబర్ .

మహేష్ బాబు కి స్వయానా బావ.సూపర్ స్టార్ కృష్ణ మెచ్చిన చిన్న అల్లుడు .అద్భుతంగా నటించగల సత్తా.అంతకు మించిన క్రేజీ బాడీ.

శరీరాన్ని ఎలాగైనా కష్టపెట్టగలడు.కానీ అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని ఉందన్నట్టు సుధీర్ బాబు కి ఎక్కడో నెగటివ్ సుడి గట్టిగా ఉన్నటు కొడుతుంది.

ఎందుకంటే ఒక సమ్మోహనం పర్వాలేదు.ప్రేమ కథ చిత్రం ( Prema Katha Chitram )అయితే హీరోయిన్ కి క్రెడిట్ వచ్చింది.

Advertisement

ఇవి తప్ప ఈ 13 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సినిమా గొప్పగా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ? అంటే లేదు అనే చెప్పాలి.ఒక పక్క వయసు చుస్తే 46.ఇంకా స్టార్ హీరో కాదు కదా హీరో అని చెప్పుకునే అవకాశం కూడా లేదు.

పోనీ విలన్ అయినా అయిపోదాం అని ఆ మధ్య నాని హీరో గా వచ్చిన ఒక సినిమాలో ట్రై చేసిన అది కూడా వర్క్ అవుట్ కాలేదు.ఆ మధ్య ఒక బాలీవుడ్ మూవీ లో ( Bollywood )కూడా నటించి వెనక్కి వచ్చేసాడు.అయితే సుధీర్ బాబు విషయంలో మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే అనవసరమైన పిచ్చి మాస్ ప్రభావానికి అయన లోను కాలేదు.

అందుకే ఒక సోకాల్డ్ హీరో ప్రొజెక్షన్ చేసుకోవాలని అనుకోవడం లేదు.ఇక్కడ వరకు సుధీర్ బాబు బాగానే ఆలోచించాడు చాల మంది తెలుగు హీరోల కన్నా కూడా.

తన ఫిజిక్ ని మైంటైన్ చేయడం లోను, తన పాత్రకు న్యాయం చేయడం లో కూడా సుధీర్ కి ఎలాంటి డోకా లేదు.కానీ సినిమాల ఎంపిక లో ఎక్కడో తప్పటడుగు పడుతూనే ఉంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

తాను ఎంత బాగా నటించిన ఆ సినిమను లేపలేకపోతున్నాడు.

Advertisement

ఇక ఇప్పుడు ఒక పిచ్చి ప్రయోగం చేసి మళ్లి చేతులు కాల్చుకున్నాడు.మూడు రకాల పాత్రలను ఒక్కటే చేసి జనాలకు అర్ధం కాకుండా ఒక సినిమా తీసి వదిలాడు.అది చూస్తే తీరా ఎవరికీ అర్ధం కాలేదు.

ఒక పాత్రలోకి ప్రేక్షకుడు వెళ్లేలోపే మరొకటి వచ్చేసి కన్ఫ్యుస్ చేసి వదిలేసాడు.ఇందులో హీరో గా సుధీర్ బాబు తప్పేమి లేదు.

పూర్తిగా దర్శకత్వ లోపం కనిపిస్తుంది.మొదటి నుంచి కూడా తలా తోక లేని దర్శకులను ఎంచుకుంటూ సుధీర్ బాబు తప్పటడుగులు వేస్తున్నాడు.

ఇక ముందైనా ఇలాంటి తప్పులు జరక్కపోతే మంచి నటుడిగా అయినా స్థిరపడిపోవచ్చు.

తాజా వార్తలు