టికెట్స్ వివాదం: సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం నానా రచ్చకు దారి తీసింది.అయినా.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.తను అనుకున్నట్లుగానే సినిమా టికెట్ల ధరలను ఖరారు చేశారు.

పేదలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.అయితే టికెట్ల రేట్లు ఇప్పుడే తగ్గాయా? గతంలో ఎప్పుడూ తగ్గలేదా? అంటే తగ్గాయనే సమాధానమే వస్తుంది.గతంలో ఇద్దరు సీఎంలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అందులో ఒకరు ఎన్టీఆర్ కాగా.మరొకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

Advertisement

ఒకప్పుడు సినిమా టికెట్ ధర 10 పైసలు, 20 పైసలు ఉన్న రోజుల్లో ఒక టికెట్ మీద నలుగురు, ఐదుగురు వ్యక్తులను హాల్లోకి పంపేవారు.అయితే కెపాసిటీకి మించి వారిని లోపలికి అనుమతించేది.

అయితే ట్యాక్స్ మాత్రం అమ్మిన టికెట్లకు మాత్రమే చెల్లించేవారు.ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక స్లాబ్ పద్దతి తీసుకొచ్చారు.

దాంతో టికెట్ రేట్లు కూడా తగ్గించారు.ఓసారి దాసరి నారాయణరావు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి.

టికెట్ రేట్లు తగ్గించడం పట్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు గోల చేస్తున్నారు.ఏదైనా పరిష్కారం చూడాలని కోరారు.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

అయితే తనకు కూడా 6 థియేటర్లు ఉన్నాయని.నిజంగా వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే అది నాక్కూడా తెలుస్తుంది.

Advertisement

ఏ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కు ఇబ్బంది అయ్యిందో వారిని నా దగ్గరికి తీసుకురావాలని చెప్పాడు.అంతేకాదు.

టికెట్ రేట్లు తగ్గించేదే లేదని తేల్చి చెప్పారు.

ఎన్టీఆర్ హయాంలో మొదలైన ఈ పద్దతి చంద్రబాబు హయాంలో కూడా కొనసాగింది.అయితే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక స్లాబ్ సిస్టమ్ తొలగించారు.మళ్లీ ఇప్పుడు వైఎస్ జగన్ టికెట్ల విషయంలో మళ్లీ జోక్యం చేసుకుంది.

దీంతో పెద్ద రచ్చ అయ్యింది.వాస్తవానికి టికెట్ల ధరలు పెంచుకునే ముందు ప్రభుత్వానికి వినతి పత్రం రాయాలనే నిబంధన మాత్రమే ఉంది.

కానీ అప్పటి వరకు ఉన్న టికెట్ల రేట్లను తగ్గించే విధంగా నిర్ణయం తీసుకోవచ్చని చట్టంలో లేదని కోర్టు వెల్లడించింది.మల్టీప్లెక్సుల టికెట్లపై రేట్లను డిసైడ్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉండదని చెప్పింది.

కానీ ప్రస్తుతం జగన్ సర్కారులో అవన్నీ ఉత్తమాటలుగానే మిగిలిపోయాయి.ప్రభుత్వం చెప్పిందే నడవాలనే పద్దతి కొనసాగుతోంది.

తాజా వార్తలు