ఎంజీఆర్ తో గొడవ వల్ల సుమన్ ఏం కోల్పోయాడు ?

ఒక రోజు షూటింగ్ లో ఉన్న సుమన్ కి అప్పటి ముఖ్య మంత్రి ఎంజీఆర్ నుంచి పిలుపు వచ్చింది.

విషయం ఏంటో తెలియక పోయిన పెద్ద మనిషి పిలిచాడు కాబట్టి సుమన్ మారు మాట్లాడకుండా వెళ్ళాడు.

సీఎం హోదా లో ఉన్న ఎంజీఆర్ సుమన్ కి ఒక మాట చెప్పాడు.నువ్వు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నావ్.

మంచి నటుడివి.పైగా మనం ఇద్దరం సినిమాల్లోనే ఉన్నాం.

అందుకే ఆ చనువు తో ఒక మాట చెప్తున్నా రోజు నిన్ను చూడటానికి వచ్చే ఒక అమ్మాయి నుంచి నువ్వు దూరంగా ఉండాలి.ఆ అమ్మాయికి పెళ్లి అయ్యింది.

Advertisement
What Happened In Between Suman And Mgr Details, Mgr, Suman, Hero Suman, Mgr Suma

పైగా పోలీస్ లకు బాసు అయినా డిజిపి కూతురు. ఆ అమ్మాయి సంసారం కూడా చేసుకోకుండా నీ చుట్టూ తిరుగుతుంది అని అన్నాడు.

దాంతో సుమన్ కి విషయం అర్ధం అయ్యింది.నేను ఆ అమ్మాయిని ప్రేమించడం లేదు.

నాకు ఈ విషయం తో కూడా ఎలాంటి సంబంధం లేదు.నాకు ఈ జాగ్రత్త చెప్పడానికి బదులు ఆ అమ్మాయిని నా దగ్గరకు రాకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా చేసుకొమ్మని ఆమె తండ్రికి చెప్పని అన్నాడు సుమన్.

What Happened In Between Suman And Mgr Details, Mgr, Suman, Hero Suman, Mgr Suma

దాంతో ఎంజీఆర్ కి కోపం నషాళానికి ఎక్కిపోయింది.నేను చెప్తున్నా మాటకు ఎదురు చెప్తావా అని మనసులో అనుకోని సుమన్ అక్కడ నుంచి పంపించాడు.కానీ ఆ తర్వాత వారం కూడా తిరగకుండా సుమన్ పై కొన్ని చిల్లర కేసులు పెట్టి అరెస్ట్ చేసి బెయిలు కూడా రాకుండా మూడేళ్ళ పాటు జైలుకు పరిమితం చేసారు సదరు పోలీస్ మరియు ముఖ్య మంత్రి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఒక పెద్ద మనిషి కి ఎదురు చెప్తే ఏం జరుగుతుందో సుమన్ కళ్లారా చూసాడు.

What Happened In Between Suman And Mgr Details, Mgr, Suman, Hero Suman, Mgr Suma
Advertisement

ఆ నరకం నుంచి అతడిని సుమన్ తల్లి ఎంతో కష్ట పడి బయటకు తీసుకచ్చింది.ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమై పోయిందో కూడా తెలియదు.సుమన్ మాత్రం ఒక అపవాదుని మోసుకుంటూ మళ్లి తన ప్రయాణం మొదలు పెట్టాడు.

జైల్లో ఉన్నా కూడా ఎక్కడ నిరాశ చెందకుండా తన దేహధారుడ్యాన్ని కాపాడుకొని, మెడిటేషన్ లాంటివి చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు.అందుకే తిరిగి వచ్చిన సుమన్ కి మళ్లి అవకాశాలు దక్కాయి.

తాజా వార్తలు