మీ పిల్లలు పాలు అస్సలు తాగడం లేదా.. అయితే ఇలా చేయండి?

పిల్లల ఎదుగుదలకు దోహదపడే పోషకాల్లో కాల్షియం( Calcium ) ఒకటి.కాల్షియం బలమైన ఎముకల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది.

కాల్షియం కు గొప్ప మూలం పాలు.అందుకే పిల్లల చేత తల్లులు ఉదయాన్నే ఒక గ్లాస్ పాలు తాగిస్తుంటారు.

అయితే కొందరు పిల్లలు పాలు తాగడానికి అస్సలు ఇష్టపడరు.రోజు మిల్క్ ను స్కిప్‌ చేస్తుంటారు.

ఈ జాబితాలో మీ పిల్లలు ఉన్నారా.? అయితే మీరు పాలుకు ప్రత్యామ్నాయాల‌ను ఎంచుకోండి.

Advertisement

పిల్లల చేత పాలను బలవంతంగా తాగించడం కంటే దానికి బదులుగా కాల్షియం రిచ్ గా ఉండే వేరే ఆహారాలను వారితో తినిపించడం చాలా ఉత్తమం.పాలు కాకుండా కాల్షియం పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆరెంజ్ పండ్లు.

‌.పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.అయితే ఆరెంజ్ పండ్లలో( Orange ) విటమిన్ సి మాత్రమే కాదు కాల్షియం కూడా మెండుగా ఉంటుంది.

కాబట్టి మీరు పిల్లల చేత రోజుకు ఒక ఆరెంజ్ ను తినిపించండి.

చియా సీడ్స్( Chia Seeds ).వీటి పరిమాణం చిన్నగా ఉన్నా అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ను కలిగి ఉంటాయి.ముఖ్యంగా చియా సీడ్స్ లో కాల్షియం రిచ్ గా ఉంటుంది.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

కాబట్టి మీరు పిల్లలకు చియా సీడ్స్ ను పెరుగు, స్మూతీస్, ఓట్ మీల్ వంటి ఫుడ్స్‌లో కలిపి ఇస్తే చక్కగా తినేస్తారు.పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్.చాలా మంది ఫేవరెట్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.

Advertisement

అయితే పుట్టగొడుగులు పాలు కంటే అధిక కాల్షియం ను కలిగి ఉంటాయి.అందుకే పిల్లలకు వారంలో ఒకటి లేదా రెండు సార్లైనా పుట్టగొడుగుల వంటల‌ను రుచి చూపించండి.

అలాగే మీ పిల్లలు పాలు తాగడం లేదంటే తప్పకుండా ఉదయం ఐదు నానబెట్టిన బాదం పప్పులను వారి చేత తినిపించండి.బాదం పప్పులో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

బ్రోకలీ, పాలకూర, సోయా ఉత్పత్తులు, చిలగడదుంప, గుడ్డు వంటి ఆహారాల్లోనూ కాల్షియం ఉంటుంది.కాబట్టి మీ పిల్లలు పాలు స్కిప్ చేస్తుంటే దానికి బదులుగా ఇప్పుడు చెప్పుకున్న ఆహారాలను వారి డైట్ లో చేర్చండి.

తద్వారా వారిలో క్యాల్షియం కొరత తలెత్తకుండా ఉంటుంది.పిల్లల శారీరక మానసిక ఎదుగుదల కూడా అద్భుతంగా సాగుతుంది.

తాజా వార్తలు