ఇప్పుడు వలస వచ్చే నాయకులతో టిఆర్ఎస్ కు కలిసొచ్చేదెంత? 

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అనేక వ్యూహాలు, ప్రతి వ్యవహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్న టిఆర్ఎస్ బిజెపిలో వలసలపై ఎక్కువగా ఫోకస్ పెంచాయి.

టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులను బిజెపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ వ్యూహం రచిస్తూ,  కొంతమంది నాయకులను పార్టీలో చేర్చుకునే పనిలో ఉంది.

ముఖ్యంగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బిజెపిలో చేర్చుకుని టిఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చింది.ఇక టిఆర్ఎస్ సైతం తామేమి తక్కువ కాదు అన్నట్లుగా బిజెపిలో ఉన్న దాసోజు శ్రావణ్, స్వామి గౌడ్ వంటి వారిని టిఆర్ఎస్ లో చేర్చుకుంది.

అయితే వీరంతా గత టిఆర్ఎస్ లో కేవలం పనిచేసిన వారే.ఇప్పుడు బిజెపి నుంచి తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారంతా మాజీ టిఆర్ఎస్ నేతలు అనే విషయం కేసిఆర్ కు బాగా తెలుసు.

  గతంలో వారి వల్ల ఏ స్థాయిలో మేలు జరిగిందనేది అంతకంటే బాగా తెలుసు.ప్రస్తుతం బిజెపి నుంచి టిఆర్ఎస్ లో చేరుతున్న నాయకుల్లో చాలామంది ప్రజాబలం ఉన్నవారు తక్కువ.

Advertisement

వారి వల్ల టిఆర్ఎస్ కు అదనపు వారం తప్ప, పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదు.అయినా టీఆర్ఎస్ నుంచి బీజేపీ లో చేరిన వారిపైనే  టిఆర్ఎస్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

వీరికి రకరకాల పదవులను ఆఫర్ చేసి మరి పార్టీలోకి తీసుకొస్తున్నారు.అయితే ఇప్పుడు వలస వస్తున్న నాయకులకు క్షేత్రస్థాయిలో పట్టు లేకపోవడం, స్థిరమైన నియోజకవర్గ వీరికి లేకపోవడం వంటివి ఇబ్బందికర పరిణామాలే.

వీరి కారణంగా టిఆర్ఎస్ కు అదనంగా కలిసి వచ్చేది ఏమీ లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన వారిలో ప్రజాబలం ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. 

వారు ఎవరూ ఇప్పుడు బిజెపిని విడిచి టిఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు.ఈ విషయంలో టిఆర్ఎస్ అగ్రనేతలు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా.వారు మాత్రం టిఆర్ఎస్ లో కంటే బీజేపీలో ఉంటేనే బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్నారు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ముఖ్యంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి వంటి వారు టిఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు.మీరే కాకుండా గతంలో ఎంతోమంది టీఆర్ఎస్ లోకి పనిచేసిన ప్రజాబలం ఉన్న నాయకులు బిజెపిలో చేరారు.

Advertisement

వారు ఎవరు మళ్లీ టిఆర్ఎస్ గూటికి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు.అయితే ప్రజా బలం లేకపోయినా బీజేపీ నుంచి నాయకులను చేర్చుకోవడం ద్వారా,  ప్రజల్లో బిజెపిపై అనుమానాలు కలుగుతాయని , ఆ పార్టీ బలహీనం అవుతుందనే సంకేతాలు జనాల్లోకి వెళితే తమకు కలిసి వస్తుందనే లెక్కలు కేసీఆర్ వేసుకుంటున్నారట.

     .

తాజా వార్తలు