ఒకవేళ చెక్​ బౌన్స్ అయితే ఎలాంటి శిక్షలు పడతాయంటే..?!

మనలో చాలామంది వారి అవసరాల కోసం బ్యాంకులో నుండి, రుణ సంస్థల నుండో ఎంతో కొంత రుణం తీసుకుని ఉండడం మామూలే.

అయితే ఇలా తీసుకున్న రుణాన్ని ప్రతి నెల ఒక నిర్దిష్ట తారీకున కొంత మొత్తాన్ని బ్యాంకులకు కట్టడం మామూలుగా జరిగిపోతూ ఉంటాయి.

ఇలా మన ప్రతి నెల దీనికోసం ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టం ఆప్షన్ లేదా డైరెక్ట్ గా చెక్కులను ఇవ్వడం చేస్తూ ఉంటాము.అయితే చెక్కు ఇచ్చిన సమయంలో పొరపాటున మన అకౌంట్లో లోన్ కు అవసరమైన మొత్తం లేకపోతే చెక్కు బౌన్స్ అయిన సందర్భాలు ఎదురైతే కనుక అది చట్ట ప్రకారం నేరం అవుతుంది.

దాంతో ఖచ్చితంగా చెక్ బౌన్స్ జరిగిన కారణంగా వారు న్యాయపరమైన కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.చెక్కు బౌన్స్ లేదా ఈసిఎస్ ఫెయిల్ అయిన రెండిటినీ ఒకేలా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

ఇందులో భాగంగా నేరస్థుడికి శిక్షగా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం, మరికొన్ని సందర్భాలలో రెండు సంవత్సరాలపాటు కూడా ఆ శిక్షణ పొడిగించే అవకాశం ఉంది.అలాగే చెక్ బౌన్స్ అయిన మొత్తానికి రెండింతలు ఎక్కువగా విధించబడుతుంది.

Advertisement
What Are The Penalties If The Check Bounces Cheque, Bounce, Economy, Punishme

మరికొన్ని సందర్భాల్లో ఈ రెండు వేసే అవకాశం కూడా లేకపోలేదు.

What Are The Penalties If The Check Bounces Cheque, Bounce, Economy, Punishme

ఎవరైనా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోక ముందే ఏదైనా కారణాల వల్ల చెక్కులు బౌన్స్ అయితే అన్న విషయం ముందే గ్రహించి ఉంటే ఈసిఎస్ ఫెయిల్ అయిన వెంటనే మీరు సంబంధిత దగ్గరికి వెళ్లి అందులో పై అధికారికి డబ్బు చెల్లించడానికి తనకి మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరితే ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడవచ్చు.లేకపోతే ఖచ్చితంగా చెక్ బౌన్స్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.కాబట్టి చట్టపరమైన కేసులు ఎదుర్కొనే దానికంటే ముందుగా సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ఈ పరిస్థితి నుంచి బయట పడవచ్చు.

Advertisement

తాజా వార్తలు