దంతాల సెన్సిటివ్‌గా మార‌డానికి కార‌ణాలేంటి.. నివార‌ణ ఎలా?

చ‌ల్ల‌టి, వేడి, తీపి, పులుపు వంటి ఆహారాలు లేదా పానీయాలు తీసుకున్నప్పుడు దంతాలు జివ్వుమ‌ని( Teeth ) లాగేస్తుంటాయి.దంతాలు సెన్సిటివ్‌గా ఉన్న‌వారికి ఇలా జ‌రుగుతుంది.

ఇది చిన్న స‌మ‌స్య‌గా అనిపించిన చాలా బాధక‌రంగా ఉంటుంది.అందువ‌ల్ల ఏమైనా తినాల‌న్న‌, తాగాల‌న్న భ‌య‌ప‌డిపోతుంటారు.

అస‌లు దంతాల సెన్సిటివ్‌గా మార‌డానికి కార‌ణాలేంటి? ఈ స‌మ‌స్యను ఎలా నివారించుకోవాలి.? వంటి విష‌యాలను ఇప్పుడు తెలుసుకుందాం.దంతాల సెన్సిటివిటీకి ముఖ్య కారణాలు కొన్ని ఉన్నాయి.

చాలా బలంగా బ్రష్ చేయడం, ఎక్కువ ఆమ్ల పదార్థాలు తినడం, క్యావిటీస్, పళ్లు పగలడం లేదా పగుళ్లు రావడం, గమ్ రిసెషన్, దంతాలపై ఉండే ఎనామెల్ ధ్వంసం కావ‌డం, చిగుళ్ల వ్యాధి వంటి కార‌ణాల వ‌ల్ల దంతాల సెన్సిటివిటీ అనేది ఏర్ప‌డుతుంది.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌లు, చిట్కాలు పాటిస్తే సుల‌భంగా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌పడొచ్చు.

Advertisement
What Are The Causes Of Tooth Sensitivity? Tooth Sensitivity, Oral Health, Health

దంతాల సెన్సిటివిటీ క‌లిగిన వారు నిత్యం సెన్సిటివ్ టూత్ పేస్ట్( Sensitive toothpaste ) ను మాత్ర‌మే ఉప‌యోగించాలి.త‌ద్వారా దంతాల మీద ఒక రక్షణ పొర ఏర్ప‌డి నరాల సున్నితత్వం త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే గట్టిగా రుద్దకుండా, సున్నితంగా బ్రష్ చేయాలి.మృదువైన బ్ర‌ష్‌ను ఉప‌యోగించండి.

నిత్యం ప్రాపర్ బ్రషింగ్, ఫ్లోసింగ్ చేయండి.

What Are The Causes Of Tooth Sensitivity Tooth Sensitivity, Oral Health, Health

క్యావిటీస్( cavities ) వల్ల సెన్సిటివిటీ ఏర్ప‌డితే డాక్టర్ దగ్గర ఫిల్లింగ్స్ చేయించుకోవాలి.దంతాల సెన్సిటివిటీ క‌లిగిన వారు ఆహార‌పు అల‌వాట్ల‌ను కూడా మార్చుకోవాలి.ముఖ్యంగా ఎక్కువ ఆమ్ల పదార్థాలు అన‌గా లెమ‌న్‌, సోడా, చింత‌పండు వంటి వాటికి వీలైనంత వ‌ర‌కు దూరంగా ఉండాలి.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఎక్కువ వేడి లేదా ఎక్కువ చల్లని పదార్థాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి.దంతాల‌ను దృఢంగా మార్చుకునేందుకు మరియు సెన్సిటివిటీ తగ్గించేందుకు మీరు దంతవైద్యుడి దగ్గర ఫ్లోరైడ్ అప్లికేషన్ చేయించుకోవచ్చు.

Advertisement

ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ దంతాల సెన్సిటివిటీని త‌గ్గించ‌డానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.

తాజా వార్తలు