పక్షవాతం బారిన ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణాలు ఏంటో తెలుసా?

పక్షవాతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మంది ఈ వ్యాధితో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.కొంద‌రు ప్రాణాలు సైతం విడుస్తున్నారు.

ప‌క్ష‌వాతం అనేది నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి.ప‌క్ష‌వాతం వ‌స్తే దాని ప్ర‌భావం శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌పై పడుతుంది.

పైగా కొంద‌రు తమ పని కూడా చేసుకోలేనంతగా అంగ వైకల్యానికి గురవుతుంటారు.అయితే అస‌లీ ప‌క్ష‌వాతం బారిన ప‌డ‌టానికి ప్ర‌ధాన‌ కార‌ణాలు ఏంటీ.? ఎవ‌రికి  ప‌క్ష‌వాతం వ‌చ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా మ‌న‌కు ఉండే కొన్ని కొన్ని చెడు అల‌వాట్ల వ‌ల్ల ప‌క్ష‌వాతం బారిన ప‌డ‌తారు.

ముఖ్యంగా ప‌రిమితికి మించి మ‌ద్యం తీసుకోవ‌డం, ధూమ‌పానం, శారీరక శ్రమ లేక పోవడం, డ్ర‌గ్స్ తీసుకోవ‌డం వంటి అల‌వాట్లు ఉన్న వారికి అధికంగా ప‌క్ష‌వాతం వ‌స్తుంటుంది.

What Are The Causes Of Paralysis Causes Of Paralysis, Paralysis, Latest News, H
Advertisement
What Are The Causes Of Paralysis? Causes Of Paralysis, Paralysis, Latest News, H

అలాగే శ‌రీరంలో హై కొలెస్ట్రాల్ పేరుకు పోవ‌డం, అధిక ర‌క్త పోటు, మ‌ధుమేహం, ఊబకాయం, అధిక ఒత్తిడి, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ స్ట్రోక్‌, హార్ట్ ఇన్ఫెక్షన్, ఇత‌ర హార్ట్ సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న వారు కూడా ప‌క్ష‌వాతానికి గుర‌వుతుంటారు.అందుకే ఇటువంటి వ్యాధులు ఉన్న వారు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి.అనేక ఆరోగ్య నియ‌మాలు పాటించాలి.

అంతేకాదు, పిల్ల‌లు పుట్టుకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ ను అధికంగా వాడే వారికీ ప‌క్ష‌వాతం వ‌చ్చే రిస్క్ ఎక్కువ‌గానే ఉంటుంది.అయితే ప‌క్ష‌ వాతం ల‌క్ష‌ణాల‌ను ముందే గుర్తించి స‌రైన స‌మ‌యంలో స‌రైన ట్రీట్ మెంట్ తీసుకుంటే గ‌నుక‌ చాలా వ‌ర‌కు దాని నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

కానీ, దుర‌దృష్టం ఏమిటం టే.దాదాపు ఎన‌బై నుంచి తొంబై శాతం మందికి ప‌క్ష‌వాతంపై స‌రైన అవ‌గాహ‌న లేక పోవ‌డం వ‌ల్ల‌ దాని బారిన ప‌డి ముప్పు  తిప్ప‌లు ప‌డుతున్నారు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు