జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏమిటి?

హిందువు శివున్ని మూర్తి రూపంలో, లింగ రూపంలోనూ పూజిస్తారు.కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.

ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం.అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యం అయినవిగా అనాది నుండి భావిస్తున్నారు.

అయితే ఈ జ్యోతిర్లింగాలను దర్శించిన, జ్యోతిర్లింగాల స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.సౌరాష్ట్ర సోమ నాథుడ్ని దర్శించిన భోగ భాగ్యాలు కలుగుతాయి.

శ్రీశైల మల్లికార్జునుడ్ని సేవించిన సర్వ దరిద్రాలు సమిసిపోతాయి.ఉజ్జయిని మహా కాలుడ్ని కొలిచిన సర్వ భయ పాపాలూ హరించుకు పోతాయి.

Advertisement
What Are The Benifits To Visit Jyothirlingalu Details, Dwadasha Jyotirlingalu, I

ఓం కారేశ్వరము అమర లింగేశ్వరుడు, ఇహ పరాలూ, సౌఖ్యానిస్తాడు.పరళి వైద్య నాథ లింగాన్ని సేవించిన అనేక దీర్ఘ వ్యాధుల నయమవుతాయి.

భీమేశ్వ రము భీమేశ్వర లింగాన్ని దర్శించిన శతృ జయం కలిగి అకాల మృత్యు భయాలు తొలగి పోతాయి.

What Are The Benifits To Visit Jyothirlingalu Details, Dwadasha Jyotirlingalu, I

రామేశ్వరము రామేశ్వర లింగాన్ని దర్శించి, కాశీలో గంగా జలాన్ని అభిషేకించిన, మహోన్నతమైన పుణ్య ఫలం కలిగి పరమపదాన్ని చేరుతారు.ద్వారక నాగేశ్వరుడ్ని దర్శించిన మహా పాతకాలూ, ఉప పాతకాలూ నశిస్తాయి.కాశీ, విశ్వేశ్వర లింగాన్ని సేవించిన సమస్త కర్మ బంధాల నుంచి విముక్తి.

నాసిక్ త్ర్యంబకేశ్వర స్వామిని కొలిచిన కోరికలు తీరుతాయి.అపవాదులు పోతాయి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

హిమాలయ కేదారేశ్వర లింగాన్ని దర్శించిన వారు ముక్తిని పొందుతారు.వీరులు ఘృష్టేశ్వర లింగాన్ని దర్శించిన ఇహపర భోగాలను అందిస్తుంది.

Advertisement

తాజా వార్తలు