షుగర్ పెషెంట్స్ యొక్క బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలంటే

మన ఇంట్లోనో, పక్కింట్లోనో, మన చుట్టాల్లోనో ఎవరో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతుండటం చూస్తుంటాం.

నేటి లైఫ్ స్టయిల్ లో చాలా సర్వసాధరణమైన సమస్యగా మారిపోయింది మధుమేహం.

ఈ సమస్యతో బాధపడేవారు తమ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాలి.ముఖ్యంగా అల్పాహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అసలు ఒక షుగర్ పేషెంట్ బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలంటే .* బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు ఖచ్చితంగా కలిగి ఉండాలి.బ్రేక్ ఫాస్ట్ అంటేనే 8-10 గంటలు ఉపవాసం చేసి, ఏదైనా తినటం.

బ్రేక్ ఫాస్ట్ ని పట్టించుకోకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి.* అరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.

Advertisement

బయటకెళ్ళి క్వాలిటి లేని నూనెతో, పిండితో హోటల్ వారు చేసే వంటకాలు తినటం కాదు, ఇంట్లోనే మంచి అల్పాహారం ప్రపేర్ చేసుకోవాలి.* షుగర్ కంటెట్ ఎక్కువగా ఉండే పదార్థాలను ముట్టకూడదు.

అలాగే ఫ్యాట్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.* తాజా పండ్లు (షుగర్ కంటెంట్ తక్కువ ఉన్నవి), కూరగాయలు తీసుకోవాలి.

* ఆపిల్స్, అవకాడో, ఓట్ మీల్ .ఇవి ఉదయాన్నే తీసుకుంటే రోజంతా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టొచ్చు.* నాణ్యమైన పెరుగు.

అంటే ఎలాంటి ఫ్లేవర్స్ కలపని పెరుగుని తీసుకోవాలి.* ఉదయాన్నే పండ్ల రసాన్ని తాగే బదులు, డైరెక్టుగా పండ్లు తినాలి.

సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే ఇవి రాత్రిపూట తింటే చాలు..!

జ్యూస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.* ఫైబర్ దొరికే పదార్థాలు, ఫ్యాట్ లేని పాలు, దాల్చిన చెక్క పొడిని చేర్చిన షుగర్ లెస్ టీ లేదా కాఫీని ఉదయాన్నే సేవించవచ్చు.

Advertisement

తాజా వార్తలు