అక్కడ పెళ్లికి వెళ్లాలంటే దాన్ని స్కాన్ చేయాల్సిందేనట!

భారతీయ సంప్రదాయాలలో వివాహానికి( Marriage ) పెద్ద పీట వేయడం జరిగింది.అందుకే భారతీయులు తమ వివాహాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటారు.

పెళ్లి వేడుకని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని మనలో దాదాపుగా అందరూ కలలు కంటూ వుంటారు.ఇక మనలో కొంతమంది అనుకుంటారు.

తమ వివాహాన్ని వెరైటీ చేసుకుందామని.ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు తన పెళ్లికార్డుతో( Wedding Card ) అందరినీ మెస్మరైజ్ చేసాడు.

కాగా వారి వెరైటీ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Advertisement

విషయం ఏమంటే ఈ యువకుడు పాన్ కార్డు మాదిరి వెడ్డింగ్ కార్డు తయారు చేయించాడు.ముందు భాగంలో ఇద్దరి ఫొటోలు, పేర్లు, డేట్ ఉండగా వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ను( QR Code ) పెట్టారు.పెళ్లి ముహూర్త సమయం, వేదిక, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిందేనట! ఏటీఎం కార్డు సైజులా ఉన్న ఈ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో( West Godavari ) వైరల్గా మారింది.

విషయం ఏమిటంటే, పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన కృష్ణా రెడ్డి - శిరీషల పెళ్లి సెప్టెంబర్ 2న జరగనుండగా వారి పెళ్లి కార్డుల్ని అందరిలా కాకుండా కాస్త వెరైటీగా రెడీ చేయించారు.పాన్ కార్డు టైపులో ఉండి.దానిపై క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు.

ఇక్కడ కొసమెరుపు ఏమంటే, వారి పెళ్లికి రావాలనుకునేవారు ఈ కోడ్ ను స్కాన్ చేయాల్సిందేనట.ఎందుకంటే, స్కాన్ చేస్తేనే పెళ్లి వేదిక సహా అన్నీ వివరాలు తెలుస్తాయి.

ఈ విషయంపై పెళ్లికొడుకు సోదరుడు స్పందిస్తూ.బెంగళూరులో ఈ కార్డు తయారుచేయించినట్లు తెలిపారు.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ఇండియాలోనే అతిపెద్ద ట్రక్కు.. దీనికి ఎన్ని చక్రాలు ఉన్నాయో తెలిస్తే..

దాంతో గోదారోళ్ల రూటే సపరేట్ అంటూ గోదారి బిడ్డలు స్టైల్ కొడుతున్నారు మరి.మరి ఈ ఐడియా మీకు నచ్చితే సింపుల్ గా కాపీ కొట్టేయండి మరి.

Advertisement

తాజా వార్తలు