వారంలో ఏ రోజు ఏ దేవుడికి ఏ పూజ చేయాలో తెలుసా?

వారంలో ఏ రోజు ఏ దేవుడికి ఏ విధంగా పూజ చేయాలో కొందరు అయోమయంలో ఉంటారు.ఏ వారం ఏ దేవునికి ప్రీతికరమైనది.

ఆ దేవునికి ఏ విధంగా పూజ చేయాలి? అలా చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఆదివారం:

Pooja Vidhanam, Sunday, Monday, Week Days Of Pooja Vidhanam

ఆదివారం సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు.ఈరోజు సూర్య దేవుని ఆరాధించడం వల్ల ఆరోగ్యంతోపాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది.ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుంది.

సూర్యభగవానునికి తెల్లటి ధాన్యమును.సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

సోమవారం:

Pooja Vidhanam, Sunday, Monday, Week Days Of Pooja Vidhanam
Advertisement
Pooja Vidhanam, Sunday, Monday, Week Days Of Pooja Vidhanam-వారంలో �

సోమవారం అంటే చంద్రునికి సంబంధించిన వారం.సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు.సోమవారం శివునికి మారేడు, బిల్వ దళాలతో పూజించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి.

సిరి సంపదలు కలగాలని కోరుకునేవారు శివుని పూజించడం వల్ల వారికి సంపదలు కలుగుతాయి.

మంగళవారం:

Pooja Vidhanam, Sunday, Monday, Week Days Of Pooja Vidhanam

మంగళవారం ఆంజనేయ స్వామిని, దుర్గామాతని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం ఖాళీ మాతను పూజించాలి.ఆంజనేయస్వామికి తమలపాకుల మాల, వడ మాలలతో అర్చన చేస్తే భయాలు, రోగాలు పోతాయని శాస్త్రం చెబుతోంది.

బుధవారం:

బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.బుధవారం వినాయకుడికి ఎర్ర మందారాలతో పూజించడంవల్ల అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం:

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

గురువారం గురుగ్రహాన్ని, సాయిబాబాను పూజించాలి.సాయిబాబాను పూజించే వారు గురువారం పాల పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి.పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.

శుక్రవారం:

Advertisement

శుక్రవారం మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు.అదే విధంగా శుక్రవారం తులసి పూజ, గోపూజలు మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి.ఈరోజు ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి.

అమ్మవారికి ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి.

శనివారం:

శనివారం అంటేనే సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు.అలాగే ఆంజనేయస్వామిని శనీశ్వరుని కూడా శనివారం పూజించవలెను.

తాజా వార్తలు