Minister Ponguleti Srinivasa Reddy : హామీలు అన్నింటినీ అమలు చేస్తాం..: మంత్రి పొంగులేటి

టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Ponguleti Srinivasa Reddy ) అన్నారు.

వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ( Kakatiya University)కి వెళ్లిన ఆయన వర్సిటీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఇందిరమ్మ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు.ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్న పొంగులేటి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు.అయితే విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాకతీయ వర్సిటీలో కే-హబ్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పరిశోధనా కేంద్రాల వంటి మౌలిక సదుపాయాల కోసం భవనాన్ని నిర్మించారు.

Advertisement
చుండ్రు నివారణకు బెస్ట్ సొల్యూషన్ ఈ ఆయిల్.. తప్పక ట్రై చెయ్యండి!

తాజా వార్తలు