"ప్రగతి భవన్" పేరు మారుస్తాం రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో పాదయాత్రతో పాటు కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రుద్రమదేవి కూడలి వద్ద రోడ్ షోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచిందని మండిపడ్డారు.భారత్ జోడోయాత్ర( Bharat Jodo Yatra )లో కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినట్లు తెలిపారు.

ఆ టైములో ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ ప్రజలను ఏ విధంగా విభజిస్తాయో అర్థమైందని అన్నారు.ఇది విద్వేషాలు రగిలించే దేశం కాదని ప్రేమను పంచే దేశమని రాహుల్ ఉద్వేగంగా ప్రసంగించారు.

Advertisement

తెలంగాణలో కేసీఆర్ కేవలం తన కుటుంబ సభ్యులకే మేలు చేసుకుంటున్నారు.ప్రధాని మోదీ ధనికులైన తన స్నేహితులకు మేలు చేసుకుంటున్నారు.

కేవలం కాంగ్రెస్ పార్టీ( Congress party ) మాత్రమే పేదలను గుర్తించి ప్రతి ఒక్కరికి మంచి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.తెలంగాణలో బీజేపీ( BJP ) కనిపించదు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన జరిపిస్తామని బీసీల రిజర్వేషన్ పెంచుతామని రాహుల్ పేర్కొన్నారు.మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు.ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ పేరును ప్రజా పాలన భవన్ గా మారుస్తామని అన్నారు.24 గంటలు వారం రోజులు తలుపులు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి ఇంకా మంత్రులు ప్రజాదర్బార్ లో ప్రజా సమస్యలు తెలుసుకుని 72 గంటల్లో పరిష్కరించే విధంగా వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ రోడ్ షోకి భారీ ఎత్తున జనం వచ్చారు.

Shocking Facts About Money Plant I Mana Health
Advertisement

తాజా వార్తలు